Fact check : సోషల్ మీడియా ఖాతాలన్నీ ప్రభుత్వ ఐడీతో వెరిఫై చేయించుకోవాలా?

భారత్‌లో సోషల్ మీడియా,ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నియంత్రణకు కేంద్రం ఇటీవల కొన్ని కీలక మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. సోషల్ మీడియా ఖాతాలన్నీ మొబైల్ ఫోన్ల ద్వారా ప్రభుత్వం ఇచ్చే ఐడీతో ధ్రువీకరించుకోవాలన్నది దాని సారాంశం. మూడు నెలల్లోగా ఈ పక్రియ పూర్తి చేయాలని అందులో పేర్కొనడం గమనార్హం.

ఈ చర్యలతో ఇంటర్నెట్ వినియోగం మరింత సేఫ్‌గా,బాధ్యతాయుతంగా మారుతుందని ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టు న్యాయవాది ప్రశాంత్ పటేల్ ఉమారావు కూడా దీన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీంతో చాలామంది ఇది నిజమేనని నమ్ముతున్నారు. అయితే ఇందులో నిజం లేదని OneIndia టీమ్ తేల్చింది. సోషల్ మీడియా ఖాతాలను ప్రభుత్వ ఐడీతో వెరిఫై చేసుకోవాలని తామెక్కడా చెప్పలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ ఖాతాలను స్వచ్ఛందంగా ధృవీకరించుకునేందుకు ముందుకొచ్చే వినియోగదారులకు తగిన యంత్రాంగాన్ని అందుబాటులోకి తీసుకురావాలని మాత్రమే
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కోరినట్లు తెలిపింది.

fake : All social media accounts do not have to be verified with govt ID within 3 months

కేంద్రం తాజాగా ఇచ్చిన మార్గదర్శకాల్లో ప్రతీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమించాలని సూచించింది. సోషల్ మీడియాలో కంటెంట్‌పై వచ్చే ఫిర్యాదులను 24గంటల్లోగా నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపింది. అలాగే దేశ సమగ్రత,సార్వభౌమత్వానికి సంబంధించి ఏదైనా తప్పుదోవ పట్టించే కంటెంట్ వైరల్‌గా మారితే... దానిపై కోర్టు లేదా ప్రభుత్వ అధికారులు సదరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను వివరాలు కోరవచ్చునని చెప్పింది. ఆ కంటెంట్ మొదట ఎవరినుంచి షేర్ అయిందో ఆ వివరాలు వెల్లడించాల్సి ఉంటుందని పేర్కొంది.

కేంద్రం మార్గదర్శకాల ప్రకారం... ఒకవేళ మహిళలకు సంబంధించి ఏదైనా అసభ్య,అశ్లీల కంటెంట్ లేదా ఫోటోలు ఉంటే... ఫిర్యాదు అందిన 24గంటల్లోగా దాన్ని తొలగించాలి. ఇక ఓటీటీల విషయానికొస్తే... ఈ ప్లాట్‌ఫామ్స్‌లో కంటెంట్ పరిశీలన కోసం మూడంచెల యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిటైర్డ్ సుప్రీం కోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో దీనిపై నియంత్రణ ఉంటుంది.

Fact Check

వాదన

సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ మూడు నెలల్లోగా ప్రభుత్వ ఐడీతో వెరిఫై చేయించుకోవాలి.

వాస్తవం

అలాంటి నిబంధన ఏమీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

రేటింగ్

Misleading
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+