హైదరాబాద్ విమోచన

Hyderabad Liberation
హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని యంగ్ మెన్ ఇంప్రూవ్ మెంట్ సొసైటీ, స్వామి రామనంద తీర్థ స్మారక కమిటీ, మహారాష్ట్ర మండల్ సహకారంతో ప్రజ్ఞా భారతి నిర్వహించింది. ఈ దినోత్సవాన్ని కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించకపోవడం సిగ్గుచేటు. విమోచనం జరగకుండా భారత యూనియన్ లో విలీనం సాధ్యం కాదనే విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. మత సంస్థల ఒత్తిడికి తలొగ్గిన కొన్ని సంస్థలు, రాజకీయ పార్టీలు విమోచన దినోత్సవానికి దూరంగా ఉన్నాయి. కొంత మంది దాన్ని విలీన దినంగా పరిగణించాలని అంటున్నారు. హింసాత్మక భయానికి, మాజీ పాలక వర్గానికి వారు సత్యాన్ని తాకట్టు పెట్టారు.

నిజాం ప్రభుత్వం మెజారిటీ హిందూ సమాజం పట్ల వివక్షను నిస్సిగ్గుగా అమలు చేసిందనడానికి ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. పది శాతం జనాభా గల ముస్లింలకే 90 శాతం ఉద్యోగాలు దక్కాయి. 600 నుంచి 1,200 రూపాయల వేతనం దక్కే ఉద్యోగాల్లో కేవలం ఐదుగురు హిందువులు మాత్రమే ఉండేవారు. సైన్యంలో 1,765 మంది అధికారులు ఉండగా వారిలో 421 మంది మాత్రమే హిందువులు.

నిజాం రాజ్యంలో 90 శాతం ఉన్న తెలుగు, మరాఠీ, కన్నడ ప్రజలకు తమ మాతృభాషలో చదువుకునే అవకాశాలు లేవు. ఉర్దూ భాషలోనే చదవాల్సి వచ్చేది. విశ్వవిద్యాలయ స్థాయి వరకు అదే పరిస్థితి. ప్రభుత్వ కార్యాలయాల్లో, హైకోర్టు నుంచి జ్యుడిషియల్ కోర్టుల వరకు ఉర్దూయే అధికార భాషగా ఉండేది. దీన్ దార్, ఇతేహాదులు ముస్లిమీన్ బలవతంగా హిందువులను, ముఖ్యంగా హరిజనులను ఇస్లాం మతంలోకి మార్చే ప్రక్రియను కొనసాగించాయి.

హిందువులపై 19 రకాల బలవంతపు పన్నులు, లేవీలను నిజాం ప్రభుత్వం విధించింది. రాజ్యంలోని 40 శాతం భూమి నిజాం, ముస్లింల చేతుల్లో ఉండేది. సాయుధ రజాకార్లు హిందువులను భయాందోళనలకు గురి చేస్తూ వచ్చారు. దీంతో ప్రజలు హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్ లో విలీనం కావాలని కోరుకున్నారు.

కాశ్మీర్ లో భారత్ పై యుద్ధం చేస్తుండగా నిజాం పాకిస్తాన్ కు 20 కోట్ల రూపాయలు ఇచ్చాడు. రజాకార్ల సూచనల మేరకు నిజాం హైదరాబాద్ ను స్వతంత్ర దేశంగా, ఇస్లాం రాజ్యంగా చేసుకోదలిచాడు. మిగతా రాజ్యాలన్నీ భారత్ లో విలీనం కాగా, నిజాం ఒక్కడే విడిగా మిగిలిపోయాడు. హైదరాబాద్ ను స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి భారత బలగాలు వెళ్లిపోవాలని ఆదేశించాడు. పాకిస్తాన్ తో అంటకాగుతూ అస్ట్రేలియా నుంచి ఆయుధాలు పొందడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు.

భారత్, హైదరాబాద్ లకు మధ్య ఘర్షణ తలెత్తితే అహ్మదాబాద్, బొంబాయిల్లో బాంబులు వేయడానికి కరాచీలో బాంబర్ స్క్వాడ్రన్ సిద్దంగా ఉంచాడు. సముద్రం ఓడరేవు కోసం గోవాను కొనుగోలు చేయడానికి పోర్చుగల్ తో సంప్రదింపులు ప్రారంభించాడు. తన రాజ్యంపై భారత్ దండెత్తుతోందంటూ నిజాం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఫిర్యాదు చేశాడు. వందలాది హిందువులను రజాకార్లు ఊచకోత కోశారు. అస్తులు లూటీ చేశారు.

ఈ స్థితిలో భారత్ పోలీసు చర్యకు దిగి హైదరాబాద్ ను రజాకార్ల నుంచి, నిజాం నుంచి విముక్తి చేసింది. అందువల్ల విమోచన లేకుండా విలీనం సాధ్యం కాదనేది గుర్తించాల్సి ఉంటుంది. రజాకార్లతో, ఇతెహాదులు ముస్లిమీన్ ల సహాయంతో నడుస్తున్న లాయక్ అలీ మంత్రివర్గాన్ని సెప్టెంబర్ 17వ తేదీన రద్దు నిజాం రద్దు చేశాడు. కాల్పుల విరమించి భారత బలగాలకు లొంగిపోవాలని తన సైన్యాన్ని ఆదేశించాడు. రాజ్య పాలనా యంత్రాంగాన్ని చేపట్టాల్సిందిగా భారత్ యూనియన్ ను రేడియో ద్వారా కోరాడు. దాంతో 18వ తేదీన తన సైన్యంతో అల్ ఎడ్రూస్ (అరబ్) జనరల్ చౌదరి ముందు లొంగిపోయాడు. ఆ తర్వాత జనరల్ చౌదరి ఆధ్వర్యంలో హైదరాబాద్ రాజ్య పాలనాయంత్రాంగం నడిచింది. 1949 డిసెంబర్ చివరి వరకు చౌదరి ఆధ్వర్యంలో పాలనాయంత్రాంగం సాగింది. ఆ తర్వాత భారత ప్రభుత్వ అధికారి ఎంకె వెల్లోడీ పాలనను నడిపించాడు. 1952లో బూర్గుల రామకృష్ణా రావు నేతృత్వంలో ఎన్నికైన ప్రభుత్వం ఏర్పడింది.

ముస్లింల ఓటు బ్యాంకు కోసం ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో విమోచన దినోత్సవం విషయంలో వెనక్కి తగ్గుతున్నాయి. ఈ రకంగా చారిత్రక సంఘటనకు మతతత్వం రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+