మార్పులతో దశ తిరుగుతుందా?
ఈ మధ్య మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ దరిమిలా బుస్సున పొంగిన అసమ్మతి అంతే తొందరగా సద్దుమణగడంతో సంస్థాగతంగా కూడా పెనుమార్పులకు శ్రీకారం చుట్టారని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయం కార్యదర్శ పదవినుంచి చొక్కాపు సూర్యనారాయణను తప్పించి ఆ పదవిలో ఎఎం రాధాకృష్ణను నియమించారు. చొక్కాపు ఈ మధ్యనే రాష్ట్ర బిసి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. రాధాకృష్ణ ఇప్పటివరకు రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల పార్టీ బాధ్యతలను చూసేవారు. ఆయన్ను పార్టీ కార్యాలయం కార్యదర్శిగా నియమించిన కారణంగా ఆయన స్థానంలో సీనియర్ నేత షరీఫ్‌ను నియమిస్తున్నట్టుగా తెలిసింది.












Click it and Unblock the Notifications
