పఠాన్ ఆత్మవిశ్వాసానికి దెబ్బ
భారత క్రికెట్ జట్టులో ఆల్ రౌండర్‌గా ఎదుగుతున్న ఇర్ఫాన్ పఠాన్‌లో ఆత్మవిశ్వాసం కొరవడుతోందని కోచ్ గ్రెగ్ చాపెల్ అంటున్నారు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ ఓటమితో మళ్లీ క్రీడాకారుల ఆటతీరు మళ్లీ చర్చనీయాంశమైన నేపథ్యంలో చాపెల్ ఆ వ్యాఖ్య చేశారు. వెస్టిండీస్‌తో మొదటి టెస్టు మ్యాచ్ నాటికి పఠాన్ తిరిగి విజృంభించే మానసిక స్థితిని సంతరించుకోగలడని చాపెల్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. ఆత్మవిశ్వాసం సన్నగిల్లి పఠాన్ సంఘర్షణకు లోనవుతున్నాడని చాపెల్ అభిప్రాయం.
పఠాన్ బంతిని మునుపటి కన్నా కాస్తా తొందరగా బంతిని వేస్తున్నాడని, సరైన చోట బంతిని వేయడమనేది ఆత్మవిశ్వాసానికి సంబంధించిన వ్యవహారమని ఆయన అన్నారు. తప్పుకు, ఒప్పుకు మధ్య పెద్ద మార్జిన్ ఉండదని ఆయన అభిమతం. వెస్టిండీస్ పర్యటనలో బ్యాటింగ్‌లో పఠాన్ వైఫల్యం చాపెల్‌ను పునరాలోచనలో పడేసినట్లే ఉంది. ఐదు బౌలర్లతో మైదానంలోకి దిగాలనేది తన ఉద్దేశమని, అయితే పరిస్థితులను బట్టి మార్పులు ఉండవచ్చునని ఆయన అన్నారు. వన్డే సిరీస్‌లో చేసిన తప్పులను భారత జట్టు టెస్టు మ్యాచ్‌ల్లో చేయకూడదని ఆయన భావిస్తున్నారు. వన్డే సిరీస్ విషయానికి వస్తే బ్యాటింగ్‌లోనూ బౌలింగ్‌లోనూ తాము పరిస్థితులకు సర్దుబాటు కాలేకపోయామని, బౌలింగ్ విషయానికి వస్తే లెంగ్త్ విషయంలో స్థిరత్వం లేదని ఆయన అన్నారు.
భారత జట్టులో ప్రతిభ వెలుగులోకి వచ్చి స్థిరమైన ఆట తీరును ప్రదర్శిస్తుందని నమ్మకం కుదిరిన సమయంలో వెస్టిండీస్ చేతిలో ఘోరంగా దెబ్బతింది. ఐదు వన్డేల సిరీస్‌ను 1-4 స్కోరుతో ఓడిపోయింది. భారత బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. అదే సమయంలో బౌలర్లు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌ను భారత బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. భారత బౌలర్లు ఒక లెంగ్త్‌లో బంతిని విసరకుండా వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ తమ ఆటతీరును ప్రదర్శించారు. అదే తీరును భారత బ్యాట్స్‌మెన్ ప్రదర్శించడంలో విఫలమయ్యారు. మొత్తం మీద వెస్టిండీస్ కెప్టెన్, మేటి బ్యాట్స్‌మన్ బ్రియాన్ లారాకు ఈ సిరీస్ ఒక కానుకనే అయింది.












Click it and Unblock the Notifications
