వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మలిదశలో టిఆర్‌ఎస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

రాయుడు అంతటితో ఆగిపోలేదు. అండర్‌ 19 జట్టులో రాయుడు ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నాడు. ఇంగ్లాండుతో జరిగిన మ్యాచ్‌లో 26 బౌండరీలు, 4 ఫోర్లతో 159 పరుగులు చేసి హర్షధ్వానాలు అందుకున్నాడు. నిరుగు సెప్టెంబర్‌ 1వ తేదీ రాయుడు క్రికెట్‌ జీవితంలో అద్భుతమైన రోజు. ఇంగ్లాండుతో జరిగిన అండర్‌ 19 క్రికెట్‌ వన్డే మ్యాచ్‌లో తానొక్కడే అయి మ్యాచ్‌ను గెలిపించాడు. గెలుపు అసాధ్యమనుకున్న సమయంలో మెరుపు వేగంతో 177 పరుగులు చేసి భారత్‌ను గెలిపించాడు. దాంతో అండర్‌ 19 భారత్‌ కోచ్‌ రాబిన్‌ సింగ్‌, ఫిజియోథెరపిస్టు అర్జున్‌ రాణా, మేనేజర్‌ రంగారెడ్డి రాయుడును ఆకాశానికెత్తారు. రాయుడి ఇన్నింగ్స్‌ అంతగా అబ్బురపరిచింది. ఇంగ్లాండు ఉంచిన 303 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో రాయుడు చూపిన తెగువ మరుపురానిది. 114 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్స్‌తో 177 పరుగులు చేశాడు.

రాయుడు స్టీవ్‌ వాను, హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ వి.వి.యస్‌. లక్ష్మణ్‌ను ఎక్కువగా ఇష్టపడతాడు. రాయుడుకు డిఫెన్స్‌ అసలు పడదు. స్ట్రోక్‌ మేకింగ్‌లో అతను అందె వేసిన చేయి. బ్యాట్‌ను ఝళిపిస్తూ బంతులను బౌండరీలు దాటించడంలో అతను ఎక్కడా తొట్రుపాటుకు గురి కాడు. అంబటి తిరుపతిరాయుడు హైదరాబాద్‌లోని భవాన్స్‌ రామకృష్ణ విద్యాలయం విద్యార్థి. అండర్‌ 16 పోటీల్లో చూపిన విశేష ప్రతిభతో రాయుడు వెలుగులోకి వచ్చాడు. 1998-2000 మధ్య 600 పరుగులు చేయడం, అందులో ఒక డబుల్‌ సెంచరీ వుండడంతో అతను అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. హైదరాబాద్‌ కోచ్‌ విజయ పాల్‌ దగ్గర రాయుడు తన బ్యాటింగ్‌కు మెరుగులు దిద్దుకున్నాడు. రాయుడు తండ్రి ఎ. సాంబశివరావు స్టేట్‌ ఆర్కీవ్స్‌ డిపార్ట్‌మెంటులో ఉద్యోగి. రాయుడి ప్రతిభను మొగ్గలోనే గమనించి ప్రోత్సహించడాతను.

ప్రముఖ క్రికెట్‌ వ్యాఖ్యాత హర్ష భోగ్లే తిరుపతిరాయుడిని సచిన్‌ టెండూల్కర్‌తో పోల్చి ప్రశంసించాడు. అంటే రాయుడిలో ఉన్న పాటవమేమిటో అర్థం చేసుకోవచ్చు. వి.వి.యస్‌. లక్ష్మణ్‌ సలహాలు తాను తీసుకుంటూ ఉంటానని చెప్పే రాయుడు వినయవిధేయతలకు పెట్టింది పేరు. పబ్లిసిటీకి కూడా అతను దూరంగానే ఉంటాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X