పోలీసు బాస్‌కు గాలం
కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వకూడదని కాంగ్రెస్ నాయకులు సమావేశంలో నేరుగా అనలేదు. ఇవ్వాలంటే రాయలసీమ, తెలంగాణ నాయకులు ఒంటి కాలి మీద లేస్తారనేది వారికి అనుభవంలో ఉన్నదే. ఇవ్వకూడదంటే కోస్తా నాయకులు రెచ్చిపోతారని వారికి తెలుసు. ఈ స్థితిలో కొంత వ్యూహాత్మకంగా వీరు వ్యవహరించారు. రాష్ట్రంలోని కృష్ణానదీ జలాల్లో తగినంత నీరు లేకపోవడాన్ని వారు ఆసరా చేసుకున్నారు.
మంచినీటి సరఫరాకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, నాగార్జున సాగర్ రిజర్వాయర్‌లో మంచినీటి సరఫరాకు అవసరమైనంత నీటిని నిల్వ చేయాలని, ఇందులో ఆవిరి, ట్రాన్స్‌మిషన్ నష్టాలను కూడా లెక్కలోకి తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు అఖిల పక్ష సమావేశంలో చెప్పారు. ఆ తర్వాతే సాగునీటి విడుదలకు పూనుకోవాలని వారు ప్రభుత్వానికి సూచించారు. ఇది కాంగ్రెస్‌ను గట్టెక్కించేనా? వేచి చూడాల్సిందే!












Click it and Unblock the Notifications