ఆసీస్ ను గెలిపించిన్న అంపైర్స్

మ్యాచ్ లో అంపైర్ నిర్ణయం తీసుకోవటం లో సంగ్దిగ్దం లో పడితే స్కేర్ లెగ్ అంపైర్ తో చర్చిస్తారు లేదా థర్డ్ అంపైర్ ను అడుగుతారు. కాని నిన్న అంపైర్ బెన్సన్ మాత్రం క్యాచ్ పట్టారా లేదా అని ఆసీస్ కెప్టెన్ పాంటింగ్ ను అడిగి గంగూలి ని అవుట్ గా ప్రకటించడం చాలా బాదాకరం. టీవి రిప్లై లో బంతి నేల కు తాకినట్టు గా స్పష్టం గా తెలిసింది . అంతే కాకుండా క్యాచ్ పట్టిన తరువాత ఫీల్డర్ బంతిని నేలకు తాకించాడు. కానీ అంపైర్ బెన్సన్ మాత్రం ఆసీస్ కెప్టెన్ పాంటింగ్ ను సంప్రదించి గంగూలి ను పెవిలియమ్ పంపాడు. ద్రవిడ్ ఆడాలని ప్రయత్నించిన బంతి అతని ప్యాడ్ ను తాకుతూ కీపర్ గిల్ క్రిస్ట్ చేతిలో పడింది. తరువాత ఆసీస్ ఫీల్డర్లు అప్పీల్ చేయటం ద్రవిడ్ నాటౌట్ ను కూడా బక్నర్ అవుట్ ప్రకటించటం బాదాకరం.
టెస్ట్ మొదటి రోజు నుంచి కూడా అంపైర్లు ఆసీస్ కు అనుకూలంగానే ఉన్నారు. ఈ విషయం పై ఐసిసి చీఫ్ మాల్కం స్పీడ్ మాట్లాడుతూ అంపైర్లు విదులు సరిగానే నిర్వహించారు అని చెప్పారు. అంపైర్లు బక్నర్ , బెన్సన్ వలనే మనం సిడ్నీ టెస్ట్ ఓడిపోయామనే చెప్పుకోవాలి. జట్టు ను గట్టెక్కించే ప్రయత్నం లో ఉండగా అంపైర్ల వివాస్పద నిర్ణయాలతో పెవిలియన్ ముఖం పట్టడం తో జట్టు మానసికం గా కొంత బలహీన పడింది. ఇలా అంపైర్లు ఆసీస్ కు విజయాన్ని అందించారు. ఇక తరువాత మ్యాచ్ లకైన అంపైర్లను మార్చక పోతే ఈ సీరీస్ సజావుగా సాగడం అనుమానమే.












Click it and Unblock the Notifications
