వారికి ఒక్కొక్కరికీ రూ. లక్ష సాయం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణలోని యువత సివిల్ సర్వీసెస్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థ సంయుక్తంగా రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వెల్లడైన సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో తెలంగాణకు చెందిన 31 మంది అభ్యర్థులు తుది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ మరోసారి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం అందించనుంది. ఇక సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన తెలంగాణ రాష్ట్రంలోని అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహకం అందించేందుకు రెండు నెలల క్రితం దరఖాస్తులను ఆహ్వానించింది.

ఈ దరఖాస్తుల్లో 158 మంది అర్హులైన అభ్యర్థులను గుర్తించి, ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున మొత్తం రూ.1.58 కోట్ల ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సాయంతో అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు మరింత ఉత్సాహంతో సన్నద్ధమయ్యారు. అయితే వారిలో తాజాగా 31 మంది అభ్యర్థులు తుది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ త్వరలో ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున అదనపు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఇక సివిల్స్ మెయిన్స్‌ లో ఉత్తీర్ణులై తుది ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. అభ్యర్థులు తుది పరీక్షలోనూ విజయం సాధించి తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Telangana 1 lakh each will be provided to 31 candidates from who have qualified for UPSC Mains

ఇక ఇంటర్వ్యూకు ఎంపికైన 31 మందిలో వరంగల్ జిల్లా నుంచి ఏకంగా ఆరుగురు ఉన్నారు. అలాగే మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా నుంచి నలుగురు, హైదరాబాద్, జగిత్యాల జిల్లాల నుంచి ముగ్గురు చొప్పున ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. అలాగే నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లా నుంచి ఇద్దరు చొప్పున ఎంపికయ్యారు. ఇక ఇక నారాయణపేట, ఆదిలాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఫైనల్ ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు.మరోవైపు ఈ 31 మంది అభ్యర్థుల్లో 18 మంది ఓబీసీ వర్గాలకు చెందిన వారు కాగా.. ఎస్టీ అభ్యర్థులు ఇద్దరు, ఎస్సీ అభ్యర్థులు ముగ్గురు, 8 మంది జనరల్ అభ్యర్థులు ఉన్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+