రెండేళ్లలో మేడ్ ఇన్ ఇండియా ఫ్లైట్- 100 ఎయిర్ పోర్టులు- రామ్మోహన్ ప్రకటన..!

వచ్చే రెండేళ్లలో పూర్తిగా దేశీయంగా తయారైన పౌర విమానం ఎగరనుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) విశాఖలో ప్రకటించారు. 31వ సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సులో భాగంగా నిర్వహించిన ప్రత్యేక ప్లీనరీలో మాట్లాడుతూ.. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు ఉండగా, ఇవాళ ఆ సంఖ్య 166కి పెరిగిందన్నారు. ఉడాన్ పథకం ద్వారా సామాన్యుడికి విమాన ప్రయాణం చేరువైందని, తద్వారా వార్షిక ప్రయాణికుల సంఖ్య 25 కోట్లకు చేరిందని తెలిపారు.

Explainer: జగన్ కోసమే చట్టం చేస్తున్న చంద్రబాబు..! దేశంలో ఇదే తొలిసారి..!
Explainer: జగన్ కోసమే చట్టం చేస్తున్న చంద్రబాబు..! దేశంలో ఇదే తొలిసారి..!

30 వేల కోట్ల బడ్జెట్‌తో ప్రారంభమైన ఉడాన్ రెండో దశలో భాగంగా 2036 నాటికి దేశంలో మరో 100 విమానాశ్రయాలు, 200 ఆధునిక హెలిపోర్టులను నిర్మిస్తామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విమానాశ్రయాలలో ప్రయాణికుల సౌకర్యార్థం 'డిజి యాత్ర' వంటి ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టడం వల్ల ప్రవేశ సమయం 90 సెకన్ల నుండి 20 సెకన్లకు తగ్గిందన్నారు. ఏపీలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గడువు కంటే 6 నెలల ముందే పూర్తి చేశామన్నారు. అనంతపురం జిల్లా లేపాక్షి సమీపంలో ఏరోస్పేస్ , డిఫెన్స్ సిటీని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

Made-in-India Aircraft Will Fly Within Two Years Ram Mohan Naidu Announces at Vizag CII Summit
Central Government Employees:
Central Government Employees:

అలాగే ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం, హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ మధ్య 'సీ-ప్లేన్' సేవలను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ​విమాన విడిభాగాల తయారీ, మరమ్మతులు, డ్రోన్లు, ఎయిర్ ట్యాక్సీల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని, పరిశ్రమ వర్గాలు, యువ పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం దేశంలో విమాన అనుసంధానత విస్తరణ, విమానాశ్రయాలు-విమానయాన సంస్థల సామర్థ్యం పెంపు, అంతర్జాతీయ స్థాయిలో పోటీతత్వం దిశగా పౌర విమానయాన రంగం తదుపరి అభివృద్ధి సాధించాల్సిన అంశాల పై ఈ సమావేశంలో చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+