Explainer: జగన్ కోసమే చట్టం చేస్తున్న చంద్రబాబు..! దేశంలో ఇదే తొలిసారి..!

దేశంలోనే తొలిసారి ఏపీలో సీఎం చంద్రబాబు (Chandrababu) ఓ చట్టం చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ చట్టం తయారీ వెనుక ఉన్న కారణం విపక్ష వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. రాష్ట్రంలో 2014 నుంచి 2024 మధ్య చోటు చేసుకున్న పరిణామాల్లో పెట్టుబడులు పెట్టాలంటేనే భయపడుతున్న పెట్టుబడిదారుల్ని ఆకట్టుకునేందుకు చంద్రబాబు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు ఏంటో, ఈ చట్టం చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ఓసారి చూద్దాం..

పెట్టుబడిదారుల కోసం చంద్రబాబు చట్టం (Chandrababu)

ఆంధ్రప్రదేశ్ కు వచ్చే పెట్టుబడులకు రాష్ట్రంలో జరిగే రాజకీయ మార్పుల నుంచి రక్షణ కల్పించేలా కొత్త చట్టాన్ని తీసుకురావడానికి సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ పెట్టుబడుల సదస్సు వేళ చంద్రబాబు ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. దీంతో ఈ చట్టంపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా పెట్టుబడిదారులు ఆత్మరక్షణలో పడుతున్న నేపథ్యంలో వారిలో భరోసా నింపేందుకు ఈ చట్టం తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమవుతోంది. దీంతో ఈ చట్టంలో ఏం రక్షణలు ఉండబోతున్నాయనే చర్చ జరుగుతోంది.

Chandrababu Government Plans New Law to Protect Investors Even If YS Jagan Returns to Power
ఏపీలో యూఏఈ పెట్టుబడులు..! సీఐఐ సదస్సు వేళ చంద్రబాబు చర్చలు..!
ఏపీలో యూఏఈ పెట్టుబడులు..! సీఐఐ సదస్సు వేళ చంద్రబాబు చర్చలు..!

ఇంతకీ ఈ చట్టం ఎందుకు ?

ఈ చట్టం అమల్లోకి వస్తే భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన హామీలను, కేటాయించిన భూములను, కల్పించిన రాయితీలను ఇష్టానుసారంగా మార్చడానికి వీలుండదు. ప్రతిపాదిత పెట్టుబడుల రక్షణ చట్టం ద్వారా ఒకసారి పరిశ్రమకు భూమి కేటాయించినా, ప్రోత్సాహకాలు ప్రకటించినా, అనుమతులు ఇచ్చినా.. తర్వాత వచ్చే ప్రభుత్వం వాటిని ఏకపక్షంగా రద్దు చేయడానికి లేదా మార్చడానికి వీలులేకుండా చట్టపరమైన రక్షణ కల్పించనున్నారు. దీనివల్ల పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాల మార్పుపై భయం ఉండదు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరింత నమ్మకం ఏర్పడుతుంది. ఈ చట్టానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కాన్సెప్ట్‌ నోట్‌ సిద్ధం చేసింది. పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వచ్చే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.

Chandrababu Government Plans New Law to Protect Investors Even If YS Jagan Returns to Power
వైసీపీ కాకినాడ మేయర్ అభ్యర్ధి ఖరారు- పార్టీలో చేరగానే జగన్ ప్రకటన..!
వైసీపీ కాకినాడ మేయర్ అభ్యర్ధి ఖరారు- పార్టీలో చేరగానే జగన్ ప్రకటన..!

జగన్ అధికారంలోకి వచ్చినా..

గతంలో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అప్పటికే చంద్రబాబు సర్కార్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలను సమీక్షించడం ప్రారంభించారు. ఇందులో విద్యుత్ ఒప్పందాలు, పోలవరం ప్రాజెక్టు సహా ఎన్నో నిర్ణయాలు ఉన్నాయి. వీటిని జగన్ సమీక్షించడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రం వదిలి వెళ్లాల్సిన పరిస్ధితులు వచ్చాయని కూటమి పార్టీలు ఆరోపించాయి. దీంతో రాష్ట్రంలో తిరిగి జగన్ అధికారంలోకి వచ్చినా పెట్టుబడుల్ని ముట్టుకోకుండా, ఒప్పందాలను సమీక్షించకుండా ఈ చట్టంలో జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తోంది. భవిష్యత్తులో జగన్‌ వంటి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలను రాజకీయ నిర్ణయాలతో మార్చకుండా చట్టమే అడ్డుకట్ట వేయాలన్నది ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. రాజకీయాలు మారొచ్చు.. ప్రభుత్వాలు మారొచ్చు.. కానీ పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలు మాత్రం మారకూడదు. అదే లక్ష్యంతో చంద్రబాబు తీసుకురాబోతున్న ఈ చట్టం ఏపీ పారిశ్రామిక భవిష్యత్తులో కీలక మలుపుగా మారబోతుందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+