తివారీ సెక్స్ స్కామ్ వెనక...

తివారీకి అత్యంత సన్నిహితుడైన ఓఎస్డీ మహిళలను ఏ విధమైన అడ్డంకులు లేకుండా రాజభనవ్ లోకి తీసికెళ్లారని, వారి వివరాలు రికార్డుల్లో కూడా లేకుండా చూస్తారని అలీ చెప్పారు. మహిళల ప్రవేశంపై శర్మ ప్రోటోకాల్ ను, నియమ నిబంధనలను పాటించరని ఆయన చెప్పారు. రాజభవన్ కు వచ్చిపోయే వారి వివరాలు పూర్తిగా రికార్డుల్లో ఉండాలి కానీ ఈ మహిళల వివరాలు కాగితాల మీదనే పెట్టారు. గవర్నర్ కు అత్యంత సన్నిహితులని, అందువల్ల కేవలం గుర్తింపు కార్డులు చూసి శరీరాలను తనిఖీ చేసి లోనికి పంపాలని ఆ మహిళల విషయంలో భద్రతా సిబ్బందికి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.
కుటుంబ సభ్యులు, ముఖ్య అతిథుల పేరు మీద ఓఎస్డీ వారిని లోనికి అనుమతించినట్లు చెబుతున్నారు. ఆ మహిళలు రాత్రివేళ వస్తుంటారని, ఓఎస్డీకి అత్యంత సన్నిహితులైనందున పెద్దగా ఎవరూ అభ్యంతర పెట్టరని చెబుతున్నారు. నిఘా విభాగం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే ఎవరినైనా రాజభవన్ లోకి అనుమతించాల్సి ఉంటుంది. కానీ ఈ మహిళల విషయంలో మాత్రం అదేమీ ఉండదు.
తనపై కుట్ర జరిగిందని తివారీ ఇంతకు ముందు అన్నారు. తనపై వచ్చిన సెక్స్ స్కామ్ ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. తనపై తెలంగాణ ఉద్యమకారులు కుట్ర చేశారని కూడా ఆయన ఆరోపించారు. తాను ప్రజా జీవితంలో కొనసాగుతానని కూడా ఆయన డెహ్రాడూన్ లో చెప్పారు. కానీ తివారీ ఈ సెక్స్ స్కామ్ నుంచి బయట పడే సూచనలు కనిపించడం లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications