తారలను భాను ట్రాప్ చేశాడా?

సింగనమల రమేష్‌ను కూడా పోలీసులు ప్రశ్నంచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రమేష్ అనతి కాలంలోనే భారీ నిర్మాతగా ఎదగాడని అంటున్నారు. భారీ పెట్టుబడులతో నిర్మించిన ఖలేజా, కొమురం పులి సినిమాలకు అతను నిర్మాత. ఈ రెండు సినిమాలకు దాదాపు 80 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టినట్లు చెబుతున్నారు. ఇదంతా భాను చీకటి సామ్రాజ్యం వల్లనే సాధ్యమైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కళ్యాణ్ ఎంతగా కొట్టిపారేసినప్పటికీ భానుతో అతనికి గల సంబంధాలపై మీడియా కథనాలు ఆగిపోవడం లేదు. సింగనమల రమేష్‌పై కూడా అలాంటి కథనాలే ప్రసారమవుతున్నాయి.
దాదాపు 150 చిత్రాలు నిర్మాణవుతుంటే కేవలం 25- 30 మంది నిర్మాతలే ఉండడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఐదుగురు నిర్మాతలు సినీ రంగాన్ని శాసిస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఈ బడా నిర్మాతలు కోట్లాది రూపాయల పెట్టుబడులతో సినిమాలు నిర్మిస్తూ మిగతా నిర్మాతలను తొక్కిపారేస్తున్నారనే విమర్శలు చాలా కాలంగానే వినిపిస్తున్నాయి. ఓ వైపు షూటింగులు ఆపేస్తున్నట్లు నిర్మాతల మండలి ప్రకటించగా సంక్రాంతికి ఇన్ని సినిమాలు విడుదల కావడం వెనక మతలబు ఏమిటనే ప్రశ్న కూడా వస్తోంది. ఇదంతా వారి వెనక గల డబ్బు పలుకుబడి అంటున్నారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనేదే ప్రశ్నార్థకంగా మారింది. అందువల్లనే కొద్ది మంది నిర్మాతలకు భాను కిరణ్ ముఠాతో గల సంబంధాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. బాలీవుడ్‌లో లాగానే టాలీవుడ్‌లోనూ మాఫియా ప్రవేశించిందనే ప్రచారం ఊపందుకుంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications