తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రపంచ రికార్డ్ దిశగా వందేళ్ల జాతీయ గీతం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Indian national anthem
మంగళవారంతో వందేళ్లు పూర్తి చేసుకున్న జనగణమనకు ప్రపంచ రికార్డును తీసుకు వచ్చే దిశలో గీతాలాపన జరుగుతోంది. ప్రముఖ విద్యావేత్త, న్యాయవాది కె ఎస్ వాసు ఆధ్వర్యంలో ఈ గీతాలాపన మంగళవారం ఉదయం ఏడు గంటలకు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలోని మహతి కళామందిరంలో ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన జనగణమన గీతాలాపన సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది.

ఇందుకోసం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు హాజరయ్యారు. కాగా రవీంద్రుడు ఈ జనగణమనను చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో రాశారు. బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని రాసింది కూడా రవీంద్రుడే. జనగణమనను మన భారత రాజ్యాంగం 1950 జనవరి 24న జాతీయ గీతంగా స్వీకరించింది. ఆయన మొదటిసారి బెంగాళీలో ఈ గీతాన్ని ఆలపించారు. ఈ గీతానికి బాణీలు కట్టింది కూడా విశ్వకవే. ఆ తర్వాత ఇంగ్లీషులోకి అనువదించారు.

భారత జాతీయ గీతం జనగణమనను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గీతంగా యునెస్కో గుర్తించింది. ఎన్నో ప్రశంసలు పొందిన ఈ గీతంపై వివాదాలు కూడా లేకపోలేదు. ఇందులోని సింధు పదాన్ని తొలగించాలని కొందరు కోర్టుకెక్కగా దానిని కోర్టు తిరస్కరించింది. అలాగే తెల్లదొరలను ఈ గీతం రాశారనే వివాదం కూడా ఉంది. తెల్లదొరలను కీర్తిస్తూ రాసిన గీతం కాబట్టి దానిని ఎలా ఆమోదించాలని ప్రశ్నించే వారూ ఉన్నారు. అంతేకాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆదేశాల మేరకే రవీంద్రుడు ఈ గీతాన్ని రాశారని, ఆయన స్వతహాగా రాయలేదని అంతేకాకుండా గీతానికి బాణీలు కట్టింది తానేనని నేతాజీ అనుచరుడు ఒకరు తెరపైకి వచ్చారు.

English summary
Indian National Anthem Janaganamana will be ready to create world record on its hundreds year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X