కుమారుల భవిష్యత్తుపై మోహన్ బాబు దృష్టి
టాలీవుడ్‌లో కింది స్థాయి నుంచి టాప్ స్టార్ గా ఎదిగిన నటుల్లో మోహన్ బాబు ఒకరు. పరిశ్రమలో బాగా సెటిలైన సీనీ కుటుంబాల్లో మంచు ప్యామిలీ ఒకటి. తన తోటి నటుల మాదిరి మోహన్ బాబు కూడా తన వారసులను పరిశ్రమలో ఓ స్థాయికి తేవాలని చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. అయితే ఆయన కోరిక మాత్రం పూర్తి స్థయిలో తీరడం లేదు. పెద్ద కొడుకు మంచు విష్ణు పలు సినిమాల్లో నటించినా పెద్దగా లాభం లేక పోయింది.ఆయన నటించిన చాలా సినిమాలు ప్లాపు కావడంతో మోహన్ బాబు సొంత బ్యానర్ కు నష్టాలే మిగిలాయి. ప్రస్తుతం విష్ణు సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడనే అంటున్నారు పరిశ్రమ వర్గాలు.
ఇక మిగిలింది మంచు మనోజ్. మనోజ్ అయినా పరిశ్రమలో తన పేరు నిలబెడతాడని, తన సినీ వారసుడిగా ఎదుగుతాడని బోలెడు ఆశలు పెట్టుకున్నాడు మోహన్ బాబు. తనలా క్రమశిక్షణగా ఉండాలనేది ఆయన ఆలోచన. అయితే మనోజ్ వ్యవహారం పూర్తిగా అందుకు భిన్నరంగా ఉంది. కెరియర్ పై శ్రద్ధలేక పోవడం పెద్ద మైనస్ పాయింట్ అయితే, ఈ మద్య తరచూ మనోజ్ తన కోస్టార్స్ తో తలబిరుసుగా ప్రవర్తిస్తుండటం మోహన్ బాబు మనసుకు రుంచించడం లేదు. ఇలాంటి ఆడిట్యూడ్ ఉంటే సినీ పరిశ్రమలో ఎదగడం కష్టం అనేది ఆయన భావన.
పుత్ర రత్నాన్ని మారుద్దామని ఎంత ప్రయత్నించా, ఎన్నిసార్లు మందలించినా, మనోజ్ ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నాడట. మళ్లీ మళ్లీ తండ్రికి కోపం తెప్పిస్తున్నాడట. దీంతో ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతున్నాడు పెద్దాయన. ఆ గొడవ పక్కన పెడితే....ప్రస్తుతం మనోజ్ 'మిస్టర్ నోకియా", 'ఊకొడతారా.. ఉలిక్కి పడతారా" అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉన్నాడు.












Click it and Unblock the Notifications