నిత్యానంద వాదన: రంజితకు ఆశలు

సదరు రాజకీయ నాయకులు ఆ సిడిలను మార్కెట్లోకి తేకముందే తన భక్తులకు చూపించి వారి నుండి కూడా భారీగా డబ్బులు గుంజారని ఆరోపించారు. తనపై వచ్చిన అపవాదు తప్పని నిరూపిస్తానని చెప్పారు. కోర్టులో తన నిజాయితీ నిరూపించుకున్న తర్వాత ప్రజల్లో అవగాహన కలిగించేందుకు పాదయాత్ర చేస్తానని అన్నారు. కాగా వచ్చే జూలై 15న బెంగుళూరులో ప్రజల ముందు కుండలీకరణ శక్తిని ప్రదర్శిస్తానని ఆయన చెప్పారు. అందులో భాగంగా గ్రాము పౌడర్ తీసుకొని కొన్ని వేల కిలో మీటర్ల దూరం పంపిస్తానని చెప్పారు. ఆ అద్భుతాన్ని ప్రజల ముందే చేస్తానని స్పష్టం చేశారు. రూ.10 కోట్ల వ్యయంతో తిరువణ్ణామలైలో కార్డియాక్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తానని చెప్పారు. అందులో ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తానని చెప్పారు.
మత గురువులను, ఆధ్యాత్మిక వేత్తలను హింసించిన రాజకీయ నాయకులకు ప్రజలు మంచి బుద్ధి చెప్పారని డిఎంకె పార్టీని ఉద్దేశించి అన్నారు. కాగా కరుణానిధి ఆధ్వర్యంలోని డిఎంకె పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో దారుణంగా ఓటమి చెందిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications