వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్పొరేట్ సంస్థల కాళ్ల కిందికి అగ్రతారల నీళ్లు

|
Google Oneindia TeluguNews

Shahrukh Khan-Aamir Khan
సల్మాన్ ఖాన్ సహ నిర్మాతగా రూపుదిద్దుకున్న చిత్రం 'చిల్లర్ పార్టీ" జూలై 8న విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా బాలీవుడ్ లో చోటు చేసకుంటున్న నూతన ధోరణిలకు అద్దపడుతుంది. బాలీవుడ్ అగ్రహిరోలైన అమీర్ ఖాన్, షారూఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, అజయ్ దేవగన్, సైఫ్ ఆలీ ఖాన్ లకు వారి వారి సొంత ప్రొడక్షన్ సంస్థలను ఏర్పాటు చేసకున్నారు. వీరు కథా ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ ప్రభావం నేపధ్యంలో స్వాంత్రంత్య నిర్మాతలతో పాటు కార్పొరేట్ నిర్మాణ సంస్థలకు నటుల కొరత ఏర్పడుతుంది. వీరికి రెండే మార్గాలు కనబుతున్నాయి. ఒకటి కొత్త నటీనటులతో సినిమాలు తీయటం, రెండోది హిరోలతో కలిసి నిర్మాణ బాధ్యతలు పంచుకోవటం.ఈ విషయం పై బాలీవుడ్ సిని వర్గ విశ్లేషకుడు తరణ్ ఆదర్ష్ మాట్లాడుతూ బాలీవుడ్ తారల ఈ నిర్మాణ పద్దతులను హాలివుడ్ నుంచి అలవర్చకున్నట్లు చెబుతున్నారు. '' సొంత బ్యానర్ల పై సినిమాలు నిర్మించుకుంటున్న హిరోలు అధిక ఫలితాన్ని పొందుతున్నారు. అంతేకాకుండా సినిమా శాటిలైట్ ప్రసార హక్కులను నిలుపుకుంటున్నార "ని ఆదర్ష్ విశ్లేషించారు.

ఇప్పటి హిరోలతో పోలిస్తే అలనాటి ఆగ్ర హిరోలకు సొంత నిర్మాణ సంస్థలు లేవు. రాజ్ కపూర్, దేవ్ ఆనంద్, మనోజ్ కుమార్, ఫిరోజ్ ఖాన్ లు హిట్ చిత్రాలను తమ సొంత బ్యానర్ లోనే నిర్మించుకున్నారు. అమితాబచ్చన్, రాజేష్ కన్నాలు ఆలస్యంగా తమ సొంత బ్యానర్లను ఏర్పాటు చేసుకున్నారు. దిలీప్ కుమార్, సంజీవ్ కుమార్, షమ్మీ కపూర్, రాజ్ కుమార్ తదితర హిరోలకు నిర్మాణ సంస్థలు లేవు.ప్రస్తుత నటలతో అప్పటి నటులను పోలీస్తే అలనాటి హిరో దేవ్ ఆనంద్ 1950లో నవకేతన్ నిర్మాణ సంస్ధను ఆఫ్సర్ అనే నిర్మాతతో కలిసి ఏర్పాటు చేశారు. తరవాత గడచిన 25 సంవత్సరాలలు ఆ బ్యానర్ పై దేవ్ ఆనంద్ 18 సినిమాలు నిర్మించారు. అదే సమయంలో 60 బయట సినిమాల్లో ఆయన నటించారు.

కాని ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ప్రస్తుత హిరోలకు కావల్సినన్ని ఆఫర్లు, భారీ పారితోషకాలు, ప్రయోగత్మాక చిత్రాలను తమ సొంత బ్యానర్ల పై నిర్మించుకుంటూ రికార్డులను సృష్టిస్తున్నారు. షారూఖాన్ మై నేమ్ ఈస్ ఖాన్ (జనవరి 2010) తరువాత ఇప్పటి వరకు సినిమా లేదు రా - వన్ సినిమాను అక్టోబర్ 2011లో విడుదల చేసుందుకు షారూఖ్ సన్నాహాలు చేస్తున్నాడు. 2007 నుంచి అమీర్ ఖాన్ ఇప్పటి వరకు తారే జమీన్ పర్, గజనీ, 3 ఇడియట్స్, దోబీ ఘాట్ వంటి నాలుగు చిత్రాల్లో నటించారు. వాటిలో గజనీ, 3 ఇడీయట్స్ చిత్రాలు బయట నిర్మాతలు నిర్మించినవి కాగా మిగిలినవన్న అమీర్ సొంత బ్యానర్ నుంచి వచ్చినవే.

ఈ నేపధ్యంలో పలు నిర్మాణ సంస్థలు కొత్త దర్శకలతో పాటు నూతన నటినటులకు అవకాశం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ వంటి నిర్మాణ సంస్థలు ఇప్పటికే ఆ ప్రయత్నాలను చేస్తున్నాయి.

యూటీవీ మోషన్ పిక్షర్స్ , సీఈవో సిద్దార్థ్ రాయ్ కపూర్ ఈ విషయం పై స్పందిస్తూ హిరోలు నిర్మాతులుగా మారటం శుభపరిణామమని, తమ సొంత డబ్బును నిర్మాణంలో పెట్టడం వల్ల సినిమా పట్ల జాగ్రత్త వహిస్తారని అన్నారు. ' మేము అమీర్ తో కలిసి పనిచేస్తున్నాం తనకు సినిమా విలువ తెలసు, అనుకన్నది చేసేంత వరకు తను కష్టపడతాడని" అన్నారు.

English summary
When Chillar Party, co-produced by Salman Khan, was released earlier this month, it marked the reaffirmation of a recent trend in Bollywood: Every A-list star-Aamir Khan, Shahrukh Khan, Akshay Kumar, Hrithik Roshan, Ajay Devgan, Saif Ali Khan-has his own film production house. They have also become much more selective in doing films.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X