రాష్ట్రం దాటలేకపోతున్న తెలుగు హీరోలు

Jr NTR and Mahesh Babu
మన తెలుగులో ఇతర భాషలకు చెందిన అనువాద చిత్రాలు సంవత్సరానికి ఎన్ని విడుదలవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దాదాపు తెలుగులో సంగం మార్కెట్ ను అవే కొట్టేస్తున్నాయి. ఈ మధ్య డబ్బింగ్ చిత్రాల హవా ఎక్కవ కొనసాగుతోంది. రజనీకాంత్, విక్రమ్, సూర్య లాంటి హీరోలు తెలుగు సినిమా మార్కెట్ పై మంచి పట్టు సాధించారు. ఇతర భాషల హీరోలు మన తెలుగులో రాణించే సంస్కృ ఇప్పటిది కాదు. ఎంజీఆర్. శివాజీ గణేష్ కాలం నుంచి ఉంది. అయితే మన తెలుగు హీరోలు మాత్రం తరతరాలుగా రాష్ట్ర మార్కెట్ ను దాటడం లేదు.

విచిత్రం ఏమిటంటే...దక్షిణాదిన అన్ని సినిమా ఇండస్ట్రీలకంటే టాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు రూపొందుతున్నాయి. నిర్మాణ వ్యయం కూడా ఎక్కవే. అయితే ఈ సినిమాలన్నీరాష్ట్ర మార్కెట్ లోనే కొట్టుకు వచ్చి నష్టాల పాలవ్వడం గమనార్హం. మరి ఎందుకు ఇలా జరుగుతోంది. ఇతర భాష చిత్రాలు తెలుగు గడ్డపై విజయ దుందుబిలు మ్రోగిస్తుంటే...మనోళ్లు మాత్రం ఇతర రాష్ట్రాలపై ఎందుకు దృష్టి సారించడం లేదు? వీళ్లకి ఆ సత్తా లేదా? లేక ఆసక్తి లేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

బాలీవుడ్‌కు సినీ పరిశ్రమకు అంతర్జాతీయ, జాతీయ మార్కెట్‌ ఉంది. దక్షిణాదిన ప్రధానంగా తీసుకుంటే టాలీవుడ్‌, కోలీవుడ్‌, కన్నడ, కేరళ సినిమా రంగాలే కనిపిస్తాయి. అయితే మార్కెటింగ్‌ విషయంలో మాత్రం మన తెలుగు సినిమాలు మలయాళ మార్కెట్‌ కన్నా కూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. మమ్ముట్టి, మోహన్‌లాల్‌, సురేష్‌గోపి లాంటి మళయాళ హీరోలు తెలుగులోనూ రాణించారు.

అలాగే కోలీవుడ్‌కు సంబంధించి ఒకప్పుడు ఎంజిఆర్‌, శివాజీగణేశన్‌ల తర్వాత రజనీకాంత్‌, కమల్‌హాసన్‌...ఇప్పుడు విక్రమ్‌, సూర్య ఇంకా చాలామంది తమిళహీరోలు తెలుగు మార్కెట్‌లోకి వచ్చేస్తున్నారు. కన్నడంలో మార్కెట్‌ పరిథి చిన్నదైనా అక్కడి హీరోలు కూడా తెలుగులో రాణిస్తున్నారు. ఒకప్పుడు రాజ్‌కుమార్‌, విష్ణువర్థన్‌ల తర్వాత హీరో అర్జున్‌, ఉపేంద్రలు కూడా తెలుగులో తమదైన ముద్రను వేశారు.

తెలుగు చిత్రరంగంలో పరిస్థితి వీటన్నింటికంటే ఘోరంగా ఉంది. నాటి ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌లుగానీ, కృష్ణ, శోభన్‌బాబులుగానీ, నేటి తరం హీరోలెవరైనాగానీ వాళ్లవాళ్ల మార్కెట్‌ పరిధిని ఎంతమాత్రం పెంచుకోకపోవడం గమనార్హం. అయితే ఇప్పుడిప్పడే అల్లు అర్జున్ వంటి కొందరు తెలుగు యువ హీరోలు...ఇతర తమ చిత్రాలను ఇతర భాషల్లోకి విడుదల చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇది ఇంకా ఉధృతం అయితే తప్ప ఇతర భాషా మార్కెట్ లను మనం చేజిక్కించుకునే అవకాశం లేదు. ఇతర రాష్ట్రాలో మార్కెట్ పెంచుకున్నప్పుడే తెలుగు సినిమా నష్టాలు తగ్గుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+