వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
క్యాన్సర్ వ్యాధికి విరుగుడు కేరట్లు, పచ్చని ఆకు కూరలు

క్యాన్సర్ కణాల చుట్టూ ఆరోగ్యవంతమైన విటమిన్ - ఎ కణాలను పెంచితే క్యాన్సర్ వృద్దిని అరికట్టవచ్చునని లండన్ లోని బార్ట్స్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన డా. హేమంత్ కొచ్చర్ తాను కేంబ్రిడ్జి యూనివర్శిటీతో కలసి నాలుగు సంవత్సరాలపాటు చేసిన జాయింట్ పరిశోధనలో వెల్లడించారు. ఇంగ్లాండ్ దేశంలో ఏటా సుమారు 7,500 మంది రోగులను చంపివేస్తున్న ఈ పాన్ క్రియాటిక్ క్యాన్సర్ నివారణలో ఆచరిస్తున్న వివిధ వైద్య పద్ధతులకు, అతి తక్కువ మరణాలకు ఈ పరిశోధనా ఫలితాలు సహకరించగలవని కొచ్చర్ వెల్లడించినట్లు ఆ దేశపు వార్తాపత్రిక ది డైలీ ఎక్స్ ప్రెస్ పేర్కొంది.