వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు సినిమా: ఇంటా రచ్చా దరిద్రమే

|
Google Oneindia TeluguNews

National Film Awards
ఎప్పటి మాదిరిగా కేంద్ర ప్రభుత్వం ఈ సారి కూడా జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. అయితే.. ప్రభుత్వం ప్రకటించిన 58వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో ఈ సారి కూడా మన తెలుగు సినీ పరిశ్రమకు అవార్డులు దక్కలేదు. మరి దీనికి కారణం ఏంటి..? తెలుగు సినీ పరిశ్రమలో సత్తా ఉన్న వాళ్లు లేరా..? అని అడిగితే.. వచ్చే తొలి సమాధానం.. 'ఎందుకు లేరు' అని. మరి ఉంటే అవార్డులు ఏమౌతున్నాయి. ఇతర భాషలు, ప్రాంతాల చిత్రాలకు అన్నేసి అవార్డులు వస్తుంటే మన తెలుగు సినిమాలకు మాత్రం ఒక్క అవార్డు కూడా రాకపోడానికి వేరే కారణాలేముంటాయ్....!

మన దేశంలోనే అత్యధిక స్థాయిలో సినిమాలు నిర్మించే ఘనమైన చరిత్ర తెలుగు సినీ పరిశ్రమకు ఉంది. ఒకప్పటి తెలుగు సినీ చరిత్రను పరిశీలిస్తే.. ఎన్నో మైలురాళ్లు, మరెన్నో రికార్డులు. మరి నేడు అవన్నీ ఏమయ్యాయి..? ఇటీవలి కాలంలో మారుతున్న సమాజానికి అనుగుణంగా సినీ పరిశ్రమ కూడా మారిపోతుంది. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం తీయాల్సిన సినిమాలు ఎకనామిక్స్ కోసం తీస్తున్నారు. అసలు ఇప్పుడు వస్తున్న సినిమాలు చూస్తుంటే.. తెలుగు సినిమా దర్శక నిర్మాతలు సినిమాలు ఎందుకు తీస్తున్నారో కూడా వారికే అర్థం కాని పరిస్థితి. విమర్శకులు విమర్శించినా, ప్రశంసించినా మన కలెక్షన్లను మనకొస్తే చాలునుకునే వాళ్లే ఎక్కువ.

మన దేశాన్ని పీడిస్తున్న వారసత్వ రాజకీయాల మాదిరిగానే తెలుగు సినీ పరిశ్రమను కూడా డామినేట్ చేస్తున్న కొన్ని అంశాలున్నాయి. సినీ పరిశ్రమను శాసిస్తున్న కొందరు ప్రముఖుల కారణంగా పరిశ్రమ పక్కదారి పడుతుందనడంలో ఏ మాత్రం అకిశయోక్తి లేదు. సినిమాల్లో వెర్రి పుంతలు తొక్కుతున్న కామెడీ, శృంగారాలు కూడా సినీ పరిశ్రమ రూపు రేఖలను మార్చేస్తున్నాయి. తాము నటించే ప్రస్తుత తెలుగు సినిమాల్లో మూడు డ్యాన్సులు, ఆరు ఫైట్లు ఉంటే చాలనుకునే స్టార్ హీరోలు, చిన్న సినిమాలను పైకి రానీకుండా పరిశ్రమను శాసిస్తున్న నిర్మాతలు, తరానికి ఒకరిని పరిశ్రమకు పరిచయం చేస్తున్న కుటుంబాలు ఇలా చెప్పుకుంటూపోతే చాంతాడంత లిస్టే అవుతుంది.

హీరోయిన్ల కోసం ఉత్తరాదికి పరిగెత్తడం.. అంతా అయిపోయాక మళ్లీ వాళ్లు మనల్ని అవమానిస్తున్నారని తలలు పట్టుకోవడం మనకు సదా మామూలైపోయింది. పోనీ వాళ్లను వదిలేసి మనోళ్లకి అవకాశం ఇస్తారా అంటే అదీ లేదు. జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు స్థానం ఎప్పుడో కరువైంది. అవార్డులు చుట్టాల్లా అప్పుడప్పుడూ వచ్చి పలకరించి వెళ్తున్నప్పటికీ అవి పాటలకు మాత్రమే కానీ సినిమాకు పరిమితం కావడం లేదు. అయితే ఈసారి అవార్డుల్లో మన తెలుగు సినిమాకు కూడా ఓ అవార్డు వచ్చిందనుకోండి. అలాగని ఆ సినిమా ఏదో ఫీచర్ ఫిలిం అనుకుంటే మాత్రం పొరపాటే. ఉత్తమ విద్యావిషయ చిత్రంగా "అద్వైతం" అనే తెలుగు సినిమాకు అవార్డు లభించింది.

ఈ అవార్డుల్లో ఉత్తమ వినోదాత్మక చిత్రంగా సల్మాన్ ఖాన్ నటించిన 'దబాంగ్' ఎంపిక కాగా, ఉత్తమ చిత్రంగా 'అడమింతే మకాన్ అబు' సినిమా (మలయాళం) ఎంపికైంది. ఉత్తమ నటుడు సలీం కుమార్ (అడమింతే మకాన్ అబు), ధనుష్ (అడుకలామ్) ఉత్తమ నటిగా శరణ్య (పిరవాణమ్)లు అవార్డులు దక్కించుకున్నారు. ఈ అవార్డులు లభించిన చిత్రాలతో పోలిస్తే తెలుగు సినిమా మేకింగ్‌ తీరు ఇంకా అభివృద్ది చెందాలనేది కొందరి వాదన. మరి 58వ జాతీయ అవార్డులకైనా మన తెలుగు సినిమాలు ఎంపిక కావాలని కోరుకుంటూ.. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకు అల్ ది బెస్ట్ చెబుదాం...!

English summary
Central government announced 58th National Film Awards on Thursday. But as useval Tollywood film industry again didn't bagged even a single award. Critics says that Tollywood is making highest number of films in country but not getting any of national awards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X