జగన్ కేసులో సిబిఐ మళ్లీ దూకుడు

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ దర్యాప్తు మళ్లీ ముమ్మరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మేలో వైయస్ జగన్‌ను అరెస్టు చేసిన తర్వాత కేసు దర్యాప్తు మందగించినట్లు అనిపించింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసుతో కుమ్మక్కు కావడం వల్లనే దర్యాప్తులో వేగం తగ్గిందని తెలుగుదేశం పార్టీ వంటి ప్రతిపక్షాలు విమర్శలు కూడా చేశాయి. వైయస్ జగన్ కేసులో దర్యాప్తు నెమ్మదించడానికి సాంకేతిక కారణాలతో పాటు ఇతర కేసులు కూడా కారణమని భావిస్తున్నారు.

ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రానికి చెందిన మూడు ఎన్‌కౌంటర్ కేసుల దర్యాప్తును కూడా హైదరాబాద్ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణనే పర్యవేక్షిస్తున్నారు. కొన్ని రోజుల పాటు ఆ కేసులపై దృష్టి సారించాల్సి రావడం కూడా వైయస్ జగన్ కేసులో విచారణ మందగించడానికి కారణమని అంటున్నారు. మొత్తం ఏడు అంశాల్లో దర్యాప్తు వేగంగా జరుగుతోందని సిబిఐ తరఫు న్యాయవాది ఇటీవల సుప్రీంకోర్టులో జగన్ బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా చెప్పిన విషయం తెలిసిందే.

ఇటీవల సిబిఐ అధికారులు నిర్వహించిన సోదాలను బట్టి వైయస్ జగన్ ఆస్తుల కేసులో దర్యాప్తు వేగం పుంజుకుందని చెప్పవచ్చు. సండూర్ పవర్, భారతి సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, కోల్‌కత్తా కంపెనీలకు సంబంధించి దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని అంటున్నారు. వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సేకరించిన పత్రాల విశ్లేషణ జరుగుతోందని చెబుతున్నారు వీటీలో వెల్లడైన అంశాల ఆధారంగా సంబంధిత అధికారులను, ప్రజా ప్రతినిధులను విచారించాల్సి ఉంది.

సిబిఐ జగన్ ఆస్తుల కేసుతో పాటు సిబిఐ ఎమ్మార్, ఒఎంసి కేసులను సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఈ రెండు కూడా కీలకమైన కేసులే. ఎమ్మార్ కేసులో దర్యాప్తు ముగిసింది. ఏమైనా అదనపు సమాచారం ఉంటే తెలియజేస్తామని సిబిఐ కోర్టుకు తెలిపింది. ఒఎంసి కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుంది. ఈ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్‌ను విచారిస్తున్నారు. ఇది పూర్తయితే ఈ కేసు దర్యాప్తు దాదాపుగా ముగిసినట్లే. దీంతో సిబిఐ అధికారులకు వెసులుబాటు లభించిందని అంటున్నారు.

ఎమ్మార్, ఒఎంసి, జగన్ అక్రమాస్తుల కేసు అంటూ మూడు కేసులను విడగొడట్టి ఒక్కో కేసుకు ఒక్కో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మిగతా రెండు కేసుల దర్యాప్తు కొలిక్కి రావడంతో మిగతా బృందాలను కూడా వైయస్ జగన్ ఆస్తుల కేసు దర్యాప్తునకు వాడుకునే అవకాశం సిబిఐకి లభించింది. వీరందరితో మళ్లీ కొత్తగా బృందాలను ఏర్పాటు చేసి జగన్ కేసులో ఏడు అంశాలపై ఏకకాలంలో దర్యాప్తు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద వైయస్ జగన్ ఆస్తుల కేసులో దర్యాప్తును మరింత ముమ్మరం చేసే దిశగా సిబిఐ కదులుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+