వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Subash Chandra Bose
నేతాజీ సుభాష్ చంద్రబోసు గురించి ఇప్పటికీ వీడిపోని మిస్టరీ గురించి మరో గ్రంథం బయటకు వచ్చింది. ప్రముఖ పాత్రికేయుడు, రచయిత అయిన అనుజ్ ధర్ ఇండియన్ బిగ్గెస్ట్ కవర్-అప్ పేరుతో ఏ పుస్తకాన్ని రచించాడు. ఈ పుస్తకం నవంబర్ 17వ తేదిన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని ఇప్పటికే పలు ఇతర రాష్ట్రాలలో విడుదల చేశారు.

పుస్తకాన్ని విడుదల చేసిన సమయంలో ధర్ మాట్లాడుతూ... 1945లో ప్రారంభమైన మిస్టరీ ఇప్పటికీ వీడలేని సుభాష్ చంద్రబోసు మృతిపై మాట్లాడుతూ అన్నారు. తాను ఈ అంశాన్ని లేవనెత్తుతానని చెప్పారు. బోసు మృతిలో పారదర్శకత కోసం ఒత్తిడి తీసుకు వస్తానని చెప్పారు.

అమెరికా అధ్యక్షుడు కెన్నడీ హత్య గురించి ఆ దేశ ప్రభుత్వం.. రహస్య సమాచారం సహా అన్ని విషయాలను 1994లో బహిర్గతం చేసిన విధంగా భారత్ కూడా నేతాజీ గురించి ప్రకటించాలని అనుజ్‌ ధర్ అభిప్రాయపడ్డారు. జపాన్ ప్రకటించినట్టుగా తైపే వద్ద జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించలేదని ఆరు దశాబ్దాలుగా బ్రిటన్ విశ్వసిస్తోందని ఆయన చెప్పారు.

పుస్తకావిష్కరణ సభలో తాను ఏవిధంగా ప్రభుత్వ సమాచారంపై ఆధారపడిందీ అనుజ్‌ ధర్ వివరించారు. సుభాష్ గురించి పరిశోధనలో పదేళ్లుగా తాను పలువురు పరిశోధకులతో అనుబంధం కొనసాగించానని చెప్పారు. తైవాన్ ప్రభుత్వం కూడా విమాన ప్రమాదాన్ని విశ్వసించడం లేదని అన్నారు. 2005లో కూడా "బ్యాక్ ఫ్రమ్ డెడ్: ఇన్‌సైడ్ ది సుభాస్ బోస్ మిస్టరీ' పేరిట నేతాజీ గురించి అనుజ్‌ ధర్ గ్రంథాన్ని రాశారు.

English summary
An investigative insight in to the Netaji mystery has been provided by write-journalist Anuj Dhar in his book India's biggest cover up with the suggestion of replication of the JFK records Act in India to unravel the truth about the leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X