వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాతృ భాష తెలుగుని ప్రేమించండి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

I Love my Language Telugu Oneindia
దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు ప్రాశస్త్యం గురించి చెప్పాడు. తేట తేట తెలుగు తీపి గురించి కవులు గానం చేశారు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్‌గా తెలుగు భాష పేరు గాంచింది. అజంత భాష తెలుగు భాష పలుకు వినసొంపుగా ఉంటుంది. రాతలో దానికో సౌందర్యం ఉంది. మూల ద్రావిడం నుంచి పుట్టిన తెలుగు భాష విశేష జనాదరణ పొందింది. అంతేకాకుండా తెలుగు భాష మాట్లాడేవారి సంఖ్య దేశవ్యాప్తంగా అత్యధికంగా ఉంది. ఇంత మంది మాట్లాడే భాష తెలుగు ప్రజల మాతృభాష కావడం ఆనందదాయకం. తెలుగు పలుకుబడి, నుడి, నానుడి వినసొంపుగా ఉంటుంది. సామాన్య ప్రజానీకం కూడా కవిత్వానికి తీసిపోని భాషలో మాట్లాడతారంటే అతిశయోక్తి కాదు.

తెలుగు భాష ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్పులు చెందుతూ వస్తోంది. సాంకేతిక, శాస్త్రియ భాష పదజాలాన్ని కూడా సృష్టించుకుంటోంది. ఇతర భాషా పదజాలాన్ని తనలో జీర్ణం చేసుకోవడం ద్వారా తెలుగు భాష విస్తరిస్తోంది. అనంతమైన పదజాల సృష్టి జరుగుతోంది. తెలుగు భాషా ప్రియులకు ఆ విశాల దృక్పథం ఉంది. తెలుగు భాష అంతరించిపోతుందనే ఆందోళున తెలుగు సమాజంలో గత కొద్ది కాలంగా జరుగుతోంది. అయితే, నిత్య పరిణామశీలమైన తెలుగు భాష ఎప్పటికీ సజీవంగానే ఉఁటుందనే విశ్వాసం దాని విస్తృతిని బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలుగు కవిత్వం ఎల్లలు దాటుతోంది. తెలుగు సాహిత్యం, తెలుగు కళలు సరిహద్దులు దాటి విస్తురిస్తున్నాయి.

తెలుగు భాషలో అన్ని విషయాలను చదవడానికి తెలుగు ప్రజలు ఇష్టపడుతున్నారు. అందుకు అనుగుణంగానే అన్ని రంగాలు కూడా తమ తీరును, శైలిని మార్చుకుంటున్నాయి. తెలుగు భాషను ఎంతగానో ప్రేమించే తెలుగు ప్రజల కోసం 'వన్‌ఇండియా తెలుగు' "నా భాషాపఠనాన్ని నేను ప్రేమిస్తాను" అనే నినాదాన్ని ముందుకు తీసుకుని పోయే కార్యక్రమాన్ని చేపట్టింది.

"ఐ లవ్ రీడింగ్ మై లాంగ్వేజ్" ప్రచారం ద్వారా వన్ ఇండియా తెలుగు ప్రేమికులకు తెలుగు యాడ్ ఆన్స్, వ్యాడ్జెట్స్, బ్యాడ్జీల ద్వారా భాషా చరిత్రపై ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తోంది. భాష పట్ల తమ ప్రేమాభిమానాలను వ్యక్తం చేయడానికి పాఠకుల కోసం సోషల్ పేజీల్లో పోల్స్ కూడా నిర్వహిస్తున్నాం.

వన్ ఇండియా వ్యాడ్జెట్స్ డౌన్‌లోడ్ చేసుకుని మా కంటెంట్‌ను మీ సైట్‌లో లేదా బ్లాగ్‌లో చూడండి. మీ సైట్ నుంచి కదలకుండా మా వ్యాడ్జెట్స్ పాఠకులకు వన్ ఇండియా తాజా కంటెంట్‌ను చదవడానికి వా వ్యాడ్జెట్స్ అవకాశం కల్పిస్తున్నాయి.

మీ సైట్‌కు సరిపడా లుక్‌ను, ఫీల్‌ను పొందడానికి మా కాన్ఫిగరేషన్ పరికరాన్ని వాడండి.

చానెల్ తెలుగు ను, మీకిష్టమైన రంగును ఎంపిక చేసుకుని మీ బ్లాగ్ లేదా సైట్‌లో మే జనరేట్ చేసే కోడ్‌ను వాడండి.

తెలుగు భాష యొక్క ఔన్యత్యాన్ని ప్రపంచంలో నలు మూలల ఉన్న తెలుగు వారికి అందజేసే భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వన్ ఇండియా తెలుగు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలుగు వారందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే "నా భాషాపఠనాన్ని నేను ప్రేమిస్తాను" అనే నినాదాన్ని మీరు ఉపయోగించే ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా మీకు తెలిసిన వారందరితో షేర్ చేసుకోవడమే కాకుండా, ఫాలో అమ్మని తెలియజేయండి.

నేను తెలుగును ప్రేమిస్తాను ఫేస్‌బుక్ ఫాలో అవ్వండి. మన మాతృభాషను ప్రేమించండి. తెలుగు ప్రజలారా.. తెలుగు భాషను పది కాలాల పాటు రక్షించండి.

English summary
Ask your readers to show support to your mother tongue by sharing article on FB/Twitter/G+, (end of the article social media bar is present). Ask them to visit our FB Fan page to know more about I Love my Language, ask them to follow us.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X