సెంచరీ షాట్‌కు ఇస్రో రెడీ, ప్రధాని రాక

Jet, set: ISRO readies for century shot Sunday
నెల్లూరు: అంతరిక్ష పరిశోధనా సంస్థకు రేపు ఆదివారం కూడా పనిదినమే. ఆదివారంనాడు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) మరో మైలురాయిని దాటబోతోంది. షార్ శ్రీహరికోట నుంచి ఆదివారం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(పిఎస్‌ఎల్‌వి)-సి 21 వాహక నౌక ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ శుక్రవారం ఉదయం 6.51గంటలకు ప్రారంభమైంది.

ప్రయోగానికి 51 గంటల ముందు ప్రారంభమైన కౌంట్‌డౌన్ నిరాఘాటంగా సాగి వాతావరణం అనుకూలిస్తే ఆదివారం ఉదయం 9.51గంటలకు రాకెట్ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి నింగిలోకి ఎగరనుంది. కౌంట్‌డౌన్ జరిగే సమయంలో శాస్తవ్రేత్తలు రాకెట్‌లో రెండో దశ, నాలుగవ దశలో ద్రవ ఇంధనం నింపే ప్రక్రియలో తలమునకలై ఉన్నారు. ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ శుక్రవారం మధ్యాహ్నం షార్‌కు చేరుకుని షార్ డైరెక్టర్ ఎం చంద్రదత్తన్, శాస్తవ్రేత్తలతో కలసి ప్రయోగానికి సిద్ధంగా ఉన్న రాకెట్‌ను పరిశీలించారు. అనంతరం కౌంట్‌డౌన్ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు.

ఇది ఇస్రోకు వందో మిషన్ ప్రయోగం కావడంతో దీనిని వీక్షించేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్ రానున్నారు. ప్రధాని రానున్న నేపధ్యంలో షార్‌లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. దీనిని విజయవంతం చేసేందుకు ఇస్రో శాస్తవ్రేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రయోగం అనంతరం ప్రధాని మీడియా సమావేశంలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చనున్నారు. ప్రధానితోపాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభృతులు హాజరవుతున్నారు.

రెండు రోజులు ప్రధాని షార్ పర్యటన దృష్ట్యా షార్‌లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని వ్యక్తిగత రక్షణ భద్రత దళాలు షార్‌కు చేరుకొని మంగళవారం నుంచే షార్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రధాని చెన్నై నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శనివారం సాయంత్రం 5.30 షార్‌కు చేరుకుంటారు.

ప్రధాని రావడానికి ముందే గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రేణిగుంట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో షార్‌కు చేరుకొని ప్రధానికి స్వాగతం పలకనున్నారు. అనంతరం వారు అక్కడ నుంచి జిల్లా పర్యటనకు రానున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి స్వాగతం పలకడానికి తిరుపతి వెళ్లనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+