వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా: నవంబర్ మంగళవారమే ఎందుకు?

By Pratap
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ నెలలో మంగళవారంనాడే జరుగుతాయి. ఇలా ఎందుకునే విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ దానికో ప్రత్యేకత ఉంది. ఎన్నికలు నవంబర్‌లో జరిగినప్పటికీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేది జనవరి 20వ తేదీ. శ్వేతసౌధంలో అడుగు పెట్టడానికి అంత దాకా ఎందుకు ఆగాలనేది కూడా ఓ సందేహం. దీనికి కూడా ఓ కారణం ఉంది.

White House

గతంలో ఓటర్లు కాలి నడకన, అశ్వాల మీద ప్రయాణించి ఓటు వేసేవారు. అప్పుడు ప్రవేశపెట్టిన పద్ధతే ఇప్పటికీ అమెరికాలో కొనసాగుతోంది. నవంబర్ నెల నాటికి పంటలు కోతకు వస్తాయి. చలి తీవ్రత అంతగా పెరగదు. దాంతో ప్రజలకు ఓటు వేయడానికి వెసులుబాటు లభించడమే కాకుండా వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది.

మంగళవారం ప్రత్యేకత ఏమిటంటే .... ఆదివారం చర్చిలకు వెళ్లి ప్ర్రార్థనలు చేస్తారు. సోమవారం నాటికి వారంతా కౌంటీకి చేరుకోవడానికి వీలవుతుంది. మంగళవారం ఓటేస్తే బుధవారం అంగడి రోడు హడావిడి లేకుండా పనులు చేసుకోవచ్చు. అయితే, ప్రయాణ సౌకర్యాలు పెరగడంతో మంగళవారం పోలింగ్ నిర్వహించాలనే ఆనవాయితీని మార్చేయాలనే వాదన కూడా జరిగింది. వారాంతం రోజుల్లో పోలింగ్ నిర్వహిస్తే వోటింగ్ శాతం పెరుగుతుందని కూడా వారంటున్నారు. వై ట్యూన్‌డే అనే బృందం ఒకటి ఈ దిశగా ప్రయత్నాలు చేసింది.

ఎన్నికైన అధ్యక్షుడు పదవీ బాధ్యతలు చేపట్టడానికి జనవరి 20వ దాకా ఆగడం కూడా పాత సంప్రదాయమే. ఇంకా ముందు రోజుల్లో మార్చి 4వ తేదీ దాకా వేచి ఉండేవారు. ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడడానికి, విజేత తాను నివసిస్తున్న ప్రాంతంలో అన్ని పనులు చక్కబెట్టుకుని రాజధానికి సంసారంతో తరలి రావడానికి సరిపోయేలా అంత సమయం ఇచ్చేవారు. 20వ సవరణ ఆ తేదీని కాస్తా ముందుకు జరిపింది. మార్చి 4వ తేదీని జనవరి 20వ తేదీకి మార్చింది.

ఆధునిక ప్రపంచంలో అడుగుపెట్టినప్పటికీ అమెరికా ఎన్నికల్లో మాత్రం పాత సంప్రదాయాలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. దీన్ని మారుస్తారో లేదో తెలియదు.

English summary
Specific reasons are there to conduct USA presidential election in the month of November on Tuesday. Earlier system is still continuing in USA presidential election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X