ఛత్తీస్‌గఢ్: తెలంగాణ ఏర్పాటుపై ఏం చేయాలి?

AP Goverment writes a letter to chhattisgarh government
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర హోం శాఖ నోట్ తయారు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అందుకు అనుగుణంగా సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే దేశంలో విభజన తర్వాత నూతనంగా ఏర్పడిన రాష్ట్రాల నుంచి సమాచారం సేకరిస్తోంది. నూతన రాష్ట్ర ఏర్పాటుతో ఎదురైన వివిధ అంశాలపై సమాచారం ఇవ్వడంటూ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం. నూతన రాజధాని నిర్మాణానికి తీసుకున్న చర్యలపై సమాచారం అందించాలని ప్రభుత్వం కోరింది.

మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత అనుసరించిన విధానాలపై పూర్తి సమాచారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని కోరింది. విభజన సమయంలో స్థిర, చరాస్తులు, ప్రభుత్వానికి బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు, అప్పులను ఏ విధంగా పంచుకున్నారో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఈ మేరకు సోమవారం మీడియాలో వార్తలు వచ్చాయి.

రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగుల విభజన, ఆస్తులు, అప్పుల పంపిణీ ఏ విధంగా జరిగిందనే వివరాలు తెలపాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని కోరినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. విభజన తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో స్థానికులే ఉన్నారని, మధ్యప్రదేశ్ నుంచి రావడానికి ఎవరూ ఇష్టపడలేదని తెలిపారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నాలుగో ఉద్యోగిని ఛత్తీస్‌గఢ్ పంపాలని నిర్ణయించిందని తెలిపారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైనట్లయితే ఏ ప్రాంతంలో ఉండాలనేదానిపై వారికే అవకాశం కల్పించామని తెలిపారు. జాతీయ స్థాయి సర్వీసులలో కూడా ఇదే పద్ధతి అనుసరించామని తెలిపారు.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని ఆయన తెలిపారు. ప్రణాళిక సంఘం రాజధాని నిర్మాణం కోసం రూ. 550కోట్లు కేటాయించినట్లు తెలిపారు. విభజన సమయంలో అన్ని అంశాలను జనాభా ప్రాతిపదికన తీసుకున్నామని తెలిపారు. ఏ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను ఆ రాష్ట్రానికి చెందేట్లు ఒప్పందం చేసుకున్నామని, కార్పొరేషన్ల విషయంలో సెరిసగం అనే విధానాన్ని పాటించామని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఛత్తీస్‌గఢ్‌కి సంబంధించిన ఆస్తులను రెండు రాష్ట్రాలు సెరిసగం పంచుకున్నట్లు తెలిపారు.

నయా రాయ్‌పూర్ పేరిట నూతన రాజధాని నిర్మాణం పనులను 60,046 ఎకరాల భూమిలో ప్రారంభించామని రాయ్‌పూర్ అభివృద్ధి అధికారి ఒకరు తెలిపారు. నిర్మాణానికి 5వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశామన్నారు. ఇప్పటికే తొలి దశ పనులు పూర్తయ్యాయని తెలిపారు. 250హెక్టార్లలో అసెంబ్లీ, ఉద్యోగుల నివాస సముదాయాలను నిర్మిస్తున్నట్లు వివరించారు. ప్రణాళిక సంఘం కేటాయించిన రూ. 550కోట్ల తోపాటు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరితే నూతన రాజధాని నిర్మాణానికి కావాల్సిన మరింత సమాచారం అందిస్తామని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+