సలాం అశ్విని: సెక్స్ వర్కర్ కడుపున పుట్టి.. న్యూయార్క్ వర్సిటీలో సీటు సంపాదించి!
న్యూయార్క్ వర్సిటీలో సీటైతే వచ్చింది గానీ వాళ్లిచ్చే స్కాలర్ షిప్ ట్యూషన్ ఫీజులకే సరిపోతుంది. హాస్టల్ ఫీజు, తిండి వ్యక్తిగత ఖర్చులన్ని ఎలా? అన్న ప్రశ్న తలెత్తింది.
న్యూఢిల్లీ: సెక్స్ వర్కర్ కడుపున పుట్టిన ఓ అమ్మాయి జీవితం ఎలా ఉంటుంది. అడుగడుగునా ఛీత్కారాలు.. వెంటాడే కష్టాలు.. కదిలిస్తే కన్నీళ్లు.. ఈ పరిధిని దాటి ఒక్క అడుగు ముందుకేయడం కూడా కష్టసాధ్యమే. జీవితం మళ్లీ 'సెక్స్' దారుల వైపే మళ్లినా.. ఆశ్చర్యం లేదు.
కానీ ఆమె అడుగులు అక్కడే కూరుకుపోలేదు.. గమ్యం ఎక్కడో తెలియకపోయినా.. వేదించే గతం ఎప్పుడూ మానని గాయంలా సలుపుతున్నా.. ఆమె ధైర్యంగా ముందుకు కదలింది. అంతకుమించి జీవితం పట్ల కచ్చితమైన క్రమశిక్షణతో వ్యవహరిస్తూ వచ్చింది. ఆ క్రమశిక్షణే ఓ సెక్స్ వర్కర్ కూతురిని ఈరోజు న్యూయార్క్ వర్సిటీలో సీటు సంపాదించేలా చేసింది. ముంబైలో ఓ సెక్స్ వర్కర్ కూతురైన అశ్విని విజయగాథ ఇది.

తల్లి వేధింపులు భరించలేక:
అశ్విని తల్లి ముంబైలో ఓ సెక్స్ వర్కర్. కానీ క్రమశిక్షణ విషయంలో మాత్రం నిక్కచ్చిగా ఉండేది. క్రమశిక్షణ తప్పితే చావబాదడానికైనా వెనుకాడేది కాదు. అలా ఎన్నిసార్లు అశ్విని ఒంటిమీద బెత్తం విరిగిపోయిందో లెక్కే లేదు. ఓరోజు తన లిప్ స్టిక్ పారేసిందన్న కోపంతో ఎర్రటివాతలు పెట్టింది. ఇక తల్లి పెట్టే వేధింపులను భరించడం తనవల్ల కాదనుకుని ఓరోజు ఇంట్లోంచి పారిపోయి బయటకు వచ్చేసింది అశ్విని.

ఆశ్రయమిచ్చిన ఎన్జీవో:
ఇంటి నుంచి బయటకైతే వచ్చింది కానీ ఎక్కడికెళ్లాలి? ఏం చేయాలి? అన్న ప్రశ్నలు తలెత్తినప్పుడు ఓ అనాథగా భూమి మీద బతకడం ఎంత కష్టమో అశ్విని గుర్తు చేసుకునేది. ఇలాంటి తరుణంలో.. తల్లి ఆమెను మళ్లీ వెతికిపట్టుకుంది. అయితే ఈసారి ఓ ఎన్జీవో హాస్టల్లో చేర్పించింది. అక్కడా అవమానాలు, ఇబ్బందులు తప్పలేవు. క్రమశిక్షణ తప్పితే రోజుల పాటు అక్కడ ఆకలితో అలమటించాల్సిందే. అలా చాలాసార్లు అశ్విని ఖాళీ కడుపుతో పస్తులున్న సందర్భాలు అనేకం.

దళితుల కోసం పనిచేసి:
జీవితమంటే నిత్యం భయమే అనుకునే స్థాయి నుంచి మరో వ్యక్తికి జీవితం మీద నమ్మకం కల్పించే స్థాయికి అశ్విని ఎదిగింది. తనకు ప్రమేయం ఉన్న కళలతో క్యాన్సర్ బాధిత పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చింది. చాలామంది దళిత ప్రజలను చైతన్యం చేసే బాధ్యత తీసుకుంది. ఆ క్రమంలో దేశంలోని పలు నగరాల్లో పర్యటించి ఫోటోగ్రఫీ, థియేటర్ ఆర్ట్స్, ఎన్జీవోల్లో వాలంటీర్ గా పనిచేస్తూ అనుభవం గడించింది.

న్యూయార్క్ వర్సిటీకి లేఖ:
అయితే తన ప్రస్థానం ఇక్కడితోనే ఆగిపోవద్దని ప్రపంచ స్థాయి యూనివర్సిటీలో చేరి తన విద్యకు మరింత పదును పెట్టాలని అశ్విని భావించింది. అనుకున్నట్లుగానే న్యూయార్క్ వర్సిటీలో సీటు కోసం దరఖాస్తు చేసుకుంది. స్కాలర్ షిప్ ఇచ్చి మరీ అశ్వినిని చదివిస్తామని వర్సిటీ ముందుకొచ్చింది. దీంతో అశ్విని ఆనందానికి అవధుల్లేవు.

అశ్వినికి చేయూత:
న్యూయార్క్ వర్సిటీలో సీటైతే వచ్చింది గానీ వాళ్లిచ్చే స్కాలర్ షిప్ ట్యూషన్ ఫీజులకే సరిపోతుంది. హాస్టల్ ఫీజు, తిండి వ్యక్తిగత ఖర్చులన్ని ఎలా? అన్న ప్రశ్న తలెత్తింది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో హ్యూమన్స్ ఆఫ్ బాంబే పేజ్ అనే సంస్థను సంప్రదించింది. ఆ సంస్థ వారు తమ అధికారిక ఫేస్ బుక్ పేజీపై అశ్విని జీవితం గురించి రాశారు.
దీంతో కొన్ని వేల మంది అశ్వినికి సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అలా అక్షరాలా రూ.11,08,080 సమకూరాయి. దీంతో అశ్విని కల నెరవేరినట్లయింది. త్వరలోనే న్యూయార్క్ వర్సిటీలో ఆమె అడుగుపెట్టనుంది. కాబట్టి, నేపథ్యం ఎలాంటిదైనా పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని చెప్పడానికి అశ్విని జీవితమే ఓ మంచి ఉదాహరణ.
-
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..! -
ఇరాన్ డెడ్ లైన్ పై ట్రంప్ మళ్లీ వెనక్కి ? అదే టర్నింగ్ పాయింట్..! -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
వేసవి సెలవులలో పిల్లలు ఆ పనిచేసే అవకాశం.. తల్లిదండ్రులు అలెర్ట్! -
Tamil Nadu Poll Survey: తమిళనాడులో షాకింగ్ ఫలితాలు-లోక్ పోల్ తుది సర్వేలో వారే క్లీన్ స్వీప్..! -
చందమామకు అవతలి వైపు అద్భుతం- సంపూర్ణ సూర్యగ్రహణం












Click it and Unblock the Notifications