హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంబేలెత్తిస్తున్న ఎండలు: రోడ్డుపైనే ఆమ్లెట్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల తర్వాత బయటికి రావాలంటే పిల్లలు, పెద్దలు భయపడిపోతున్నారు. కాగా, ఏప్రిల్ 16వరకు వడగాల్పుల ప్రభావం ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఆకాశంలో మేఘాలు ఏర్పడేంత వరకూ వడగాలులా తీవ్రత ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో మాత్రం రానున్న నాలుగైదు రోజుల వరకు 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు.

గురువారం అత్యధికంగా పగటిపూట 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎండవేడిమికి తట్టుకోలేక వడదెబ్బ తగిలి పదుల సంఖ్యలో జనాలు మృత్యువాతపడుతున్నారు.

కాగా, హైదరాబాద్ నగరంలో నడిరోడ్డుపైనే ఓ వ్యాపారి గురువారం గుడ్డుతో ఆమ్లెట్ వేశారు. ముఖ్యంగా బుధ, గురువారాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి ఉష్ణోగ్రత నమోదు పెరిగింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల్లో కూడా ఉష్టోగ్రత అత్యధికంగా నమోదవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎండ వేడిమిని నుంచి తప్పించుకునేందుకు ఏసీలు, కూలర్లు వాడుతున్నారు. పుచ్ఛకాయలు, దోషకాయలు, లాంటి చల్లదనం కలిగించే పండ్లను తీసుకుంటున్నారు. బయటికి వెళ్లినప్పుడు తలకు, ముఖానికి ఎండ తగలకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఆమ్లెట్ వేస్తున్న దృశ్యం

ఆమ్లెట్ వేస్తున్న దృశ్యం

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల తర్వాత బయటికి రావాలంటే పిల్లలు, పెద్దలు భయపడిపోతున్నారు.

ఆమ్లెట్

ఆమ్లెట్

కాగా, హైదరాబాద్ నగరంలో నడిరోడ్డుపైనే ఓ వ్యాపారి గురువారం గుడ్డుతో ఆమ్లెట్ వేశారు.

ఎండ ప్రభావం

ఎండ ప్రభావం

ఏప్రిల్ 16వరకు వడగాల్పుల ప్రభావం ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

రోడ్లు ఖాళీగా...

రోడ్లు ఖాళీగా...

ఆకాశంలో మేఘాలు ఏర్పడేంత వరకూ వడగాలులా తీవ్రత ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఎండల ప్రభావం

ఎండల ప్రభావం

హైదరాబాద్ లో మాత్రం రానున్న నాలుగైదు రోజుల వరకు 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు.

గొడుగు నీడ

గొడుగు నీడ

గురువారం అత్యధికంగా పగటిపూట 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఎండల తీవ్రత

ఎండల తీవ్రత

ఎండవేడిమికి తట్టుకోలేక వడదెబ్బ తగిలి పదుల సంఖ్యలో జనాలు మృత్యువాతపడుతున్నారు.

పేపర్ల నీడలో..

పేపర్ల నీడలో..

ముఖ్యంగా బుధ, గురువారాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి ఉష్ణోగ్రత నమోదు పెరిగింది.

ఎండ తీవ్రత

ఎండ తీవ్రత

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల్లో కూడా ఉష్టోగ్రత అత్యధికంగా నమోదవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

English summary
Hyderabad, we are with you through these tough times. We know that it is hot as hell, and we will not tell you we can understand your situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X