వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలిరాత్రి ఆ 'మరక' లేకపోతే..: అక్కడ అమ్మాయిలకు పెళ్లంటే నరకమే?..

|
Google Oneindia TeluguNews

నాగ్‌పూర్: శ్వేత.. గతేడాదే పెళ్లైంది. 'తొలిరాత్రి'.. శోభనం గదిలోకి అడుగుపెట్టినప్పుడు.. ఆమె వెన్నులో వణుకు. జీవితాంతం గుర్తుండిపోయే ఓ అనుభూతికి దగ్గరవుతున్నానన్న ఫీలింగ్ కన్నా.. లోలోపల పెరిగిపోతున్న గుండె దడ ఆమెను నిలువనీయలేదు. ఆ రాత్రి ఆ 'మరక' పడితేనే.. ఆమె వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. లేదంటే.. ఊహించలేనంత భయానకంగా ఉంటాయి పరిస్థితులు..

శోభనం రాత్రి కాలరాత్రే..:

శోభనం రాత్రి కాలరాత్రే..:

'తొలిరాత్రి'.. కొత్త దంపతుల జీవితంలో అదో మరిచిపోలేని అనుభూతి. కానీ మహారాష్ట్రలోని కంజర్‌భట్స్ కమ్యూనిటీకి చెందిన మహిళలకు మాత్రం అదో కాలరాత్రి. గదిలోకి అడుగుపెట్టింది మొదలు.. ఆ తంతు పూర్తయ్యేదాకా నరకంలో ఉన్న భావన కలుగుతుంది. శోభన గది బయటే వేచి చూసే వధూవరుల తల్లిదండ్రులు.. ఏం వార్త చెబుతారోనన్న ఉత్కంఠతో ఎదురుచూస్తారు.

కన్వత్య పరీక్ష..:

కన్వత్య పరీక్ష..:


కంజర్‌భట్స్ కమ్యూనిటీలో పెళ్లంటే మామూలు విషయం కాదు. శోభనం రోజు రాత్రి వధువుకు 'కన్యత్వ' పరీక్ష తప్పనిసరి. వధూవరులను గదిలోకి పంపించేముందు ఓ తెల్లని బెడ్ షీట్ ఇస్తారు.

ఇరువురి తల్లిదండ్రులు తలుపు వద్దే కాపలా కాస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే ఏం జరిగిందనేది పంచాయితీ పెద్దలకు చెప్పడం కూడా తప్పనిసరి. వధువుకు బ్లీడింగ్ అయిందని చెబితే ఓకె. లేదంటే..

బిర్యానీ లేదా చెప్పుదెబ్బలు:

బిర్యానీ లేదా చెప్పుదెబ్బలు:

తొలిరోజు రాత్రి బెడ్‌షీట్‌పై వధువు బ్లీడింగ్ మరక కనిపిస్తే వాళ్లకో సంతోషం. ఇంటింటికి బిర్యానీ పొట్లాలు పంచి మరీ పండుగ చేసుకుంటారు. కాలేదని తెలిస్తే మాత్రం.. వధువును జుట్టుపట్టి ఈడ్చి ఊరి మధ్యలో ఒకచోట కట్టేసి చెప్పులతో కొడుతారు.
తమ పరువు తీసిందని, పెళ్లికి ముందే తిరుగుబోతు అయిందని లేనిపోని నిందలేస్తారు. పంచాయితీ పెద్దలు ఆ వధువు కుటుంబానికి భారీగా జరిమానా కూడా విధిస్తారు.

ఎవరీ కంజర్‌భట్స్:

ఎవరీ కంజర్‌భట్స్:

ప్రపంచం ఇంత పురోగతిని సాధించిన ప్రస్తుత తరుణంలోనూ.. నిండా ఛాదస్తపు భావాలను పులుముకున్న కమ్యూనిటీ కంజర్ భట్స్. నిజానికి వీళ్లు రాజస్థాన్ వాసులు. వందేళ్ల క్రితమే అక్కడి నుంచి మహారాష్ట్రకు వలస వచ్చి జీవిస్తున్నారు. సాంప్రదాయం పేరుతో యువతులను వీరు హింసిస్తున్న తీరుపై ప్రస్తుతం అక్కడ పెద్ద ఉద్యమమే నడుస్తోంది.

English summary
We attach so much stigma to their day to day, normal activities as if they are some different species altogether, meant to be subjugated to restrictions and violence
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X