బెంగళూరు సెంట్రల్ జైల్లో చిన్నమ్మ శశికళ విద్యార్థి: మౌనవ్రతం, కన్నడ, కంప్యూటర్!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో నాలుగు సంవత్సరాలు జైలు శిక్షపడి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళ నటరాజన్ అక్కడ తీరికలేకుండా గడుపుతున్నారని వెలుగు చూసింది. కన్నడ, కంప్యూటర్ సైన్స్ నేర్చుకుంటున్న శశికళ, ఆమె వదిన ఇళవరసి త్వరలోనే బహుబాషల్లో ప్రావీణ్యం సంపాధించడానికి సిద్దం అయ్యారు.

 కన్నడ మీద పట్టు!

కన్నడ మీద పట్టు!

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ, ఆమె వదిన ఇళవరసి క్రమం తప్పకుండా కన్నడ బాష శిక్షణా తరగతులకు హాజరు అవుతున్నారు. శశికళ, ఇళవరసి కన్నడ బాష రాయడం, మాట్లాడటం నేర్చుకుంటున్నారని జైళ్ల శాఖ అధికారులు అంటున్నారు.

గతంలో ఇంగ్లీష్

గతంలో ఇంగ్లీష్

జయలలిత గతంలో ఆంగ్లబాష మీద పట్టుసాధించడానికి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారని గతంలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఆంగ్ల బాష పుస్తకాలు, దినపత్రికలు తెప్పించుకుని చదువుతున్నారని బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు చెప్పారు.

మౌనవ్రతం

మౌనవ్రతం

కన్నడ రాయడం, మాట్లాడటం నేర్చుకుంటున్న శశికళ మౌనవ్రతం కారణంగా తిరిగి సమాధానం చెప్పడం లేదని జైళ్ల శాఖ సిబ్బంది అంటున్నారు. ఆమె కేవలం రాయడం నేర్చుకుంటున్నారని, ఇంత వరకూ కన్నడ మాట్లాడలేదని సమాచారం.

కంప్యూటర్ సైన్స్

కంప్యూటర్ సైన్స్

శశికళ, ఇళవరసి క్రమం తప్పకుండా కంప్యూటర్ సైన్స్ తరగతులకు హాజరు అవుతున్నారని బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు అంటున్నారు. కంప్యూటర్ సైన్స్ ను శశికళ ఎంతో ఆసక్తితో నేర్చుకుంటున్నారని సమాచారం.

లైబ్రరీలో శశికళ

లైబ్రరీలో శశికళ

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు రూ. 30 వేలు వెచ్చించి 91 దినపత్రికలు (అన్ని బాషలు), వారపత్రికలు, మాసపత్రికలు తెప్పించి లైబ్రరీలో పెడుతున్నారు. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా లైబ్రరీలు ఏర్పాటు చేశారు.శశికళ ఎక్కువ సేపు లైబ్రరీలో కాలం గడుపుతున్నారని, అక్కడి ర్యాక్ లు శుభ్రంగా పెట్టడంలో ఆసక్తి చూపిస్తున్నారని జైళ్ల శాఖ సిబ్బంది చెబుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
V K Sasikala Nataarajan, who is serving a four-year term in a Bengaluru jail in a disproportionate case, is turning a Kannadathi. The incarcerated Tamil Nadu leader is learning Kannada, prison sources said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి