హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బోనమెత్తిన కెసిఆర్, కవిత: నృత్యాలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే బోనాల పండుగ భాగ్యనగరంలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. పాతబస్తీ లాల్‌దర్వాజలోని శ్రీ సింహవాహిని దేవాలయం, శ్రీ అక్కన్న మాదన్న దేవాలయంతో పరిసర ప్రాంతాల్లోని అన్ని దేవాలయాల్లో ఆదివారం తెల్లవారుఝామున అమ్మవారి అభిషేకం మొదలుకుని ప్రత్యేక పూజాదికాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదివారం మధ్యాహ్నం లాల్‌దర్వాజలోని శ్రీ సింహవాహిని దేవాలయానికి చేరుకున్నారు.

ఆలయ నిర్వాహణ కమిటీ సభ్యులు కెసిఆర్‌కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సిఎం కెసిఆర్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి దేవాలయం తరపున బంగారు బోనాన్ని సమర్పించారు. అలాగే ప్రభుత్వం తరపున అమ్మవారికి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పట్టువస్త్రాలను సమర్పించి పూజలు నిర్వహించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రులు తాటికొండ రాజయ్య, మహమూద్ అలీలు నగరంలోని వివిధ దేవాలయాలను సందర్శించి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు.

పాతబస్తీ బోనాలకు తెలంగాణ రాష్ట్ర సమితి సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు, స్పీకర్ మధుసూదనచారి, శాసనమండలి అధ్యక్షులు స్వామిగౌడ్, ఎంపి బండారు దత్తాత్రేయ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే కె లక్ష్మణ్, ఎంపి కవిత, టిడిపి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, శాసనసభా పక్ష నేత జానారెడ్డి, మాజీ ఎంపి అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.

పాతబస్తీలోని దేవాలయాల వద్ద ఉదయం నుంచే భక్తుల కోలాహలం నెలకొంది. అన్ని దేవాలయాల వద్ద ఆదివారం ఉదయం పది గంటలనుంచే భక్తులు అమ్మవారికి బోనాలు, తొట్టెలు సమర్పించటం ప్రారంభించారు. ఉదయం పదకొండు గంటల కల్లా లాల్‌దర్వాజ శ్రీ సింహవాహిని దేవాలయం వద్ద భక్తులు పోటెత్తారు.

బోనాల ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని శ్రీ అక్కన్న మాదన్న దేవాలయం, లాల్‌దర్వాజలోని శ్రీ సింహవాహిని దేవాలయం, అలాగే కార్వాన్ దర్బార్ మైసమ్మ దేవాలయం, గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక దేవాలయాలకు వచ్చిన ఊరేగింపుల్లో భాగంగా పోతరాజు నాట్య విన్యాసాలు, శివసత్తుల నాట్యం, యువత కేరింతలు, విచిత్ర వేషధారణలు భక్తులను ఆకట్టుకున్నాయి.

బోనమెత్తిన నగరం

బోనమెత్తిన నగరం

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదివారం మధ్యాహ్నం లాల్‌దర్వాజలోని శ్రీ సింహవాహిని దేవాలయానికి చేరుకున్నారు. ఆలయ నిర్వాహణ కమిటీ సభ్యులు కెసిఆర్‌కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సిఎం కెసిఆర్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి దేవాలయం తరపున బంగారు బోనాన్ని సమర్పించారు.

బోనమెత్తిన నగరం

బోనమెత్తిన నగరం

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే బోనాల పండుగ భాగ్యనగరంలో అంగరంగ వైభవంగా జరుగుతోంది.

బోనమెత్తిన నగరం

బోనమెత్తిన నగరం

నగరంలో బోనాలు జరుగుతున్న సందర్భంగా పలువురు మూగజీవాలను చంపొద్దంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు.

బోనమెత్తిన నగరం

బోనమెత్తిన నగరం

పాతబస్తీ లాల్‌దర్వాజలోని శ్రీ సింహవాహిని దేవాలయం, శ్రీ అక్కన్న మాదన్న దేవాలయంతో పరిసర ప్రాంతాల్లోని అన్ని దేవాలయాల్లో ఆదివారం తెల్లవారుఝామున అమ్మవారి అభిషేకం మొదలుకుని ప్రత్యేక పూజాదికాలు ప్రారంభమయ్యాయి.

బోనమెత్తిన నగరం

బోనమెత్తిన నగరం

నగరంలోని అన్ని దేవాలయాలతోపాటు పాతబస్తీలోని దేవాలయాల వద్ద ఉదయం నుంచే భక్తుల కోలాహలం నెలకొంది.

బోనమెత్తిన నగరం

బోనమెత్తిన నగరం

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఇతర కాంగ్రెస్ నాయకులతోపాటు అమ్మవారిని దర్శించుకున్నారు.

బోనమెత్తిన నగరం

బోనమెత్తిన నగరం

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇతర నాయకులతో కలిసి నగరంలోని వివిధ దేవాలయాలను సందర్శించి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు.

బోనమెత్తిన నగరం

బోనమెత్తిన నగరం

ప్రభుత్వం తరపున అమ్మవారికి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పట్టువస్త్రాలను సమర్పించి పూజలు నిర్వహించారు.

బోనమెత్తిన నగరం

బోనమెత్తిన నగరం

బోనాలు సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం నృత్యం చేస్తున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి.

బోనమెత్తిన నగరం

బోనమెత్తిన నగరం

నగరంలోని అన్ని దేవాలయాల వద్ద ఆదివారం ఉదయం పది గంటలనుంచే భక్తులు అమ్మవారికి బోనాలు, తొట్టెలు సమర్పించటం ప్రారంభించారు.

బోనమెత్తిన నగరం

బోనమెత్తిన నగరం

బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న పార్లమెంటు సభ్యురాలు కవిత, ఇతర నాయకులు.

బోనమెత్తిన నగరం

బోనమెత్తిన నగరం

ఉదయం పదకొండు గంటల కల్లా లాల్‌దర్వాజ శ్రీ సింహవాహిని దేవాలయం వద్ద భక్తులు పోటెత్తారు.

బోనమెత్తిన నగరం

బోనమెత్తిన నగరం

బోనాల ఉత్సవాల్లో భాగంగా నగరంలోని అన్ని అమ్మవారి దేవాలయాల వద్ద పోతరాజు నాట్య విన్యాసాలు, శివసత్తుల నాట్యం, యువత కేరింతలు, విచిత్ర వేషధారణలు భక్తులను ఆకట్టుకున్నాయి.

బోనమెత్తిన నగరం

బోనమెత్తిన నగరం

బోనాల పండుగ సందర్భంగా భారీగా తరలివచ్చిన మహిళలు బోనాలు సమర్పించుకున్నారు.

బోనమెత్తిన నగరం

బోనమెత్తిన నగరం

సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్న దృశ్యం.

బోనమెత్తిన నగరం

బోనమెత్తిన నగరం

బోనాలు పండగు సందర్భంగా బోనాలు ఎత్తుకుని నృత్యాలు చేస్తున్న భక్తులు.

బోనమెత్తిన నగరం

బోనమెత్తిన నగరం

బోనాల ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని శ్రీ అక్కన్న మాదన్న దేవాలయం, లాల్‌దర్వాజలోని శ్రీ సింహవాహిని దేవాలయాలకు వచ్చిన ఊరేగింపుల్లో భాగంగా పోతరాజు నాట్య విన్యాసాలు, శివసత్తుల నాట్యం, యువత కేరింతలు, విచిత్ర వేషధారణలు భక్తులను ఆకట్టుకున్నాయి.

బోనమెత్తని నగరం

బోనమెత్తని నగరం

బోనాలు పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న టిడిపి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, నాయకులు.

బోనమెత్తిన నగరం

బోనమెత్తిన నగరం

బోనాల ఉత్సవాల్లో భాగంగా సనత్‌నగర్‌లో అమ్మవారి వేషధారణలో ఉరేగింపుగా వస్తున్న దృశ్యం.

బోనమెత్తిన నగరం

బోనమెత్తిన నగరం

బోనాల ఉత్సవాల్లో భాగంగా కార్వాన్ దర్బార్ మైసమ్మ దేవాలయం, గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక దేవాలయాలకు వచ్చిన ఊరేగింపుల్లో భాగంగా పోతరాజు నాట్య విన్యాసాలు, శివసత్తుల నాట్యం, యువత కేరింతలు, విచిత్ర వేషధారణలు భక్తులను ఆకట్టుకున్నాయి.

బోనమెత్తిన నగరం

బోనమెత్తిన నగరం

బోనాలు ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న సనత్‌నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి.

బోనమెత్తిన నగరం

బోనమెత్తిన నగరం

అన్ని దేవాలయాల వద్ద ఆదివారం ఉదయం పది గంటలనుంచే భక్తులు అమ్మవారికి బోనాలు, తొట్టెలు సమర్పించటం ప్రారంభించారు.

బోనమెత్తిన నగరం

బోనమెత్తిన నగరం

బోనాల ఉత్సవాల సందర్భంగా పోతరాజుల వేషధారణలో చిన్నారులు.

బోనమెత్తిన నగరం

బోనమెత్తిన నగరం

బోనాల ఉత్సవాల్లో భాగంగా నగరంలోని అన్ని అమ్మవారి దేవాలయాలకు వద్ద పోతరాజు నాట్య విన్యాసాలు, శివసత్తుల నాట్యం, యువత కేరింతలు, విచిత్ర వేషధారణలు భక్తులను ఆకట్టుకున్నాయి.

బోనమెత్తిన నగరం

బోనమెత్తిన నగరం

బోనాల పండుగ సందర్భంగా బోనాలు సమర్పించేందుకు ఊరేగింపుగా వస్తున్న భక్తులు.

బోనమెత్తిన నగరం

బోనమెత్తిన నగరం

బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని ఏనుగుపై ఊరేగిస్తున్న దృశ్యం.

బోనమెత్తిన నగరం

బోనమెత్తిన నగరం

బోనాల ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని శ్రీ అక్కన్న మాదన్న దేవాలయం, లాల్‌దర్వాజలోని శ్రీ సింహవాహిని దేవాలయం, అలాగే కార్వాన్ దర్బార్ మైసమ్మ దేవాలయం, గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక దేవాలయాలకు వచ్చిన ఊరేగింపుల్లో భాగంగా పోతరాజు నాట్య విన్యాసాలు, శివసత్తుల నాట్యం, యువత కేరింతలు, విచిత్ర వేషధారణలు భక్తులను ఆకట్టుకున్నాయి.

English summary
Bonalu, the annual festival celebrated throughout the Telangana region, particularly grandly in the twin cities of Secunderabad and Hyderabad, has taken a colorful fervour this year as Telangana’s state festival. CM KCR resented ‘Bangaru Bonam’ and ‘Pattu Vastrams’ to Mahankali Ammavaru Temple at Lal Darwaza in the Old City on behalf of the State Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X