విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శత్రు ఛేదనలో మేటి: నేవీలోకి ఐఎన్ఎస్ కర్ణ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: భారత నావికాదళాధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా విశాఖపట్టణందగ్గర భీమునిపట్నం నావికాదళ కేంద్రంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో మెరైన్ కమాండో ఫోర్స్(మార్కోస్) కేంద్రాన్ని 'ఐఎన్ఎస్ కర్ణ' పేరుతో అధికారికంగా నావికాదళ సేవల కోసం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఈస్ట్రన్ నావల్ కమాండర్ వైస్ అడ్మిరల్ శ్రీ బిస్త్, ఇతరసిబ్బంది కూడా పాల్గొన్నారు. 1987, ఫిబ్రవరి‌లో ప్రారంభించిన మెరైన్ కమాండో ఫోర్సు (మార్కోస్) మూడు విధాలుగా అంటే సముద్రం, గగనతలం, భూమి మీద కూడా పని చేస్తుంది.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మార్కోస్ తన ప్రత్యేక కార్యకలాపాలద్వారా అంతర్జాతీయ గుర్తింపును సంపాదించిందని సునీల్ లాంబా తెలిపారు. సవాళ్లను, శత్రువుల్ని ఛేదించడంలో ఐఎన్‌ఎస్‌ కర్ణ సాహసోపేతంగా ముందుకు వెళ్తుందని ఆయన ప్రకటించారు.

ఐఎన్ఎస్ కర్ణ

ఐఎన్ఎస్ కర్ణ

తూర్పు నౌకాదళం నుంచి మెరైన్‌ కమాండర్లతో కూడిన తొలి యూనిట్‌ ‘ఐఎన్‌ఎస్‌ కర్ణ'ను భారత నౌకాదళాధిపతి సునీల్‌లాంబా జాతికి అంకితం ఇచ్చారు. విశాఖ తీరంలోని భీమునిపట్నం నావెల్‌ బేస్‌లో ఈ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది.

ఐఎన్ఎస్ కర్ణ

ఐఎన్ఎస్ కర్ణ

సునీల్‌ లాంబా సతీమణి రీనాలాంబా అధికారిక లాంఛనాలతో ‘ఐఎన్‌ఎస్‌ కర్ణ'ను ప్రకటించగా.. దంపతులిద్దరూ ఈ దళం జాతికి అంకితమైనట్లు గుర్తుగా శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు.
ఐఎన్ఎస్ కర్ణ

ఐఎన్ఎస్ కర్ణ

ఐఎన్ఎస్ కర్ణ

1992 అక్టోబరు 26న విశాఖ కేంద్రంగా ఏర్పడిన ‘మార్కోస్‌ ఈస్ట్‌'లో భాగంగా మెరైన్‌ కమాండో దళంతో ఈ కొత్త యూనిట్‌ను ప్రారంభించినందుకు తనకు గర్వంగా ఉందని సునీల్‌లాంబా అన్నారు.

ఐఎన్ఎస్ కర్ణ

ఐఎన్ఎస్ కర్ణ

సవాళ్లను, శత్రువుల్ని ఛేదించడంలో ఐఎన్‌ఎస్‌ కర్ణ సాహసోపేతంగా ముందుకు వెళ్తుందని ఆయన ప్రకటించారు.

ఐఎన్ఎస్ కర్ణ

ఐఎన్ఎస్ కర్ణ

ఈ కాలం సవాళ్లకు తగ్గట్లు కమాండోలు కూడా మార్పుల్ని అందిపుచ్చుకోవాలని, నూతన యంత్రాల్ని ఆవిష్కరించుకునే స్థాయిలో ఉండాలని అన్నారు.

ఐఎన్ఎస్ కర్ణ

ఐఎన్ఎస్ కర్ణ

మార్కోస్‌ ఈస్ట్‌.. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సేవలందించిందని, ఉగ్రవాదం మీద పోరాడటమేకాక.. దేశానికి అత్యవసర పరిస్థితుల్లో సేవలందించిందని తూర్పు నౌకాదళాధిపతి హెచ్‌సీఎస్‌ బిస్త్‌ అన్నారు.

ఐఎన్ఎస్ కర్ణ

ఐఎన్ఎస్ కర్ణ

ఐఎన్‌ఎస్‌ కర్ణకు కమాండింగ్‌ అధికారిగా ఎంపికైన కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌ సంస్కృతంలో ప్రమాణం చేసి బాధ్యతల్ని స్వీకరించారు.

ఐఎన్ఎస్ కర్ణ

ఐఎన్ఎస్ కర్ణ

అంతకుముందు ఆకట్టుకునే వైమానిక విన్యాసాలు, పరేడ్‌ మధ్య భారత నౌకాదళాధిపతి సునీల్‌లాంబా గౌరవ వందనం స్వీకరించారు. ఐఎన్‌ఎస్‌ కర్ణ కమాండింగ్‌ అధికారి వరుణ్‌సింగ్‌కు జ్ఞాపిక, బ్యాడ్జిలు అందించారు.
ఐఎన్ఎస్ కర్ణ

English summary
Chief of Naval Staff Admiral Sunil Lanba on Tuesday commissioned INS Karna, an independent base of Marine Commandos (MARCOS).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X