తొలి బంతినే బౌన్సర్‌గా విసరండి: టెస్ట్‌పై మెర్వ్ హ్యూస్

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్(25) మరణంతో ప్రస్తుతం ఆసీస్ బౌలర్లు బౌన్సర్ వేయాలంటేనే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసీస్ పేస్ దిగ్గజం మెర్వ్ స్పందించాడు. బౌన్సర్లు ఆటలో భాగమేనని, వాటిపై చర్చను పొడిగించాల్సిన అవసరం లేదన్నాడు. అందుకే, ఆసీస్-భారత్ మొదటి టెస్టులో తొలి బంతినే బౌన్సర్‌గా విసిరితే ఏ సమస్య ఉండదని అభిప్రాయపడ్డాడు.

అలా కాకుండా, బౌన్సర్ విసరకుండా ఉంటే.. బౌలర్లపై మరింత ఒత్తిడి పెరుగుతుందని అన్నాడు. ఒక్కసారి బౌన్సర్ విసిరితే వాతావరణం తేలికవుతుందని పేర్కొన్నాడు. దానిపై దీర్ఘకాలిక చర్చతో నష్టం వాటిల్లో అవకాశాలే ఎక్కువని తెలిపాడు. అంతేగాకుండా, కెప్టెన్ మైకేల్ క్లార్క్ చెప్పినట్లుగా పోటీతత్వంతో కూడిన క్రికెట్ ఆడటమే హ్యూస్‌కు నిజమైన నివాళి అన్నా చెప్పాడు.

‘వంద సంవత్సరాల క్రికెట్ చరిత్రలో ఎన్నో బౌన్సర్లు సంధించడం జరిగింది. అయితే ఇలాంటి విషాదకర సఘటన మాత్రం చోటు చేసుకోలేదు. అయితే మనం ఆటను కొనసాగించాలి' ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అన్నాడు. వారం రోజుల క్రితం అబ్బాట్ విసిరిన బౌన్సర్ తలకు తగలి ఫిలిప్ హ్యూస్ మృతి చెందిన విషయం తెలిసిందే.

Merv Hughes wants India-Australia series to start with bouncer

డ్రాగా ముగిసిన రెండో ప్రాక్టీస్ మ్యాచ్

ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టును 243 పరుగులకే పరిమితం చేసిన భారత్, జవాబుగా 375 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 66 పరుగులు, విజయ్ 60, రహానే 56, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా 50, రోహిత్ శర్మ 48 పరుగులతో రాణించారు.

ఆసీస్ దేశవాళీ బౌలర్లు భారత బ్యాటింగ్ లైనప్‌పై ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. అనంతరం, రెండో ఇన్నింగ్స్ మొదట పెట్టిన ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+