మిస్ గుజరాతీగా చెన్నైకి చెందిన ఇషా(ఫోటోలు)
హైదరాబాద్: మినల్ క్రియేషన్స్ నేతృత్వంలో సికింద్రాబాద్‌లో నిర్వహించిన 'మిస్ అండ్ మిసెస్ గుజరాతీ-2015' పోటీలు శుక్రవారం రాత్రి కన్నలు పండువగా సాగాయి. 'మిస్ అండ్ మిసెస్ గుజరాతీ-2015'గా చెన్నైకి చెందిన ఇషా ఎంపికైంది.
మిస్ గుజరాతీ ఇండియా మొదటి రన్నరప్‌గా ముంబైకి చెందిన భూమి, రెండో రన్నరప్‌గా దామిని నిలిచారు. 'జేడ్ బ్లూ' సమర్పిస్తున్న మిస్ అండ్ మిసెస్ గుజరాతీ-2015 పోటీలు దేశంలోని పలు నగరాల్లో జరిగాయని, అక్టోబర్ 2న సికింద్రాబాద్‌లో గ్రాండ్ ఫినాలే నిర్వహించారు.
కాగా, మిసెస్ గుజరాతీ ఇండియాగా కోల్‌కత్తాకు చెందిన అనాషా ఎంపికైంది. మిసెస్ గుజరాతీ ఇండియా మొదటి రన్నరప్‌గా అహ్మదాబాద్‌కు చెందిన రచనా, రెండో రన్నరప్‌గా హైదరాబాద్‌కు చెందిన కృపా పటేల్ ఎంపికయ్యారు.

మిస్ గుజరాతీగా చెన్నైకి చెందిన ఇషా
'మిస్ అండ్ మిసెస్ గుజరాతీ-2015'గా చెన్నైకి చెందిన ఇషా ఎంపికైంది. మిస్ గుజరాతీ ఇండియా మొదటి రన్నరప్‌గా ముంబైకి చెందిన భూమి, రెండో రన్నరప్‌గా దామిని నిలిచారు.

మిస్ గుజరాతీగా చెన్నైకి చెందిన ఇషా
అంతక ముందు మిస్ అండ్ మిసెస్ గుజరాతీ-ఇండియా పోటీల ఫైనలిస్ట్‌లకు గ్రూమింగ్ సెషన్ నగరంలోని శామీర్ పేట మండలం తూంకుంటలోని సమ్మర్ గ్రీన్ రిసార్ట్స్‌లో గురువారం నిర్వహించారు. 31 మంది ముద్దు గుమ్మలు తమ అందచందాలతో హోయలొలికించారు.

మిస్ గుజరాతీగా చెన్నైకి చెందిన ఇషా
కవ్వించే కళ్లు, మురిపించే చిరునవ్వుల సొగసులతో కనివిందు చేశారు. మినల్ క్రియేషన్స్ నేతృత్వంలో జరగనున్న జేడ్‌బ్లూ, నీతూస్ 'మిస్ అండ్ మిసెస్ ఇండియా-2015' తుది పోటీలు నగరంలో జరగనున్న నేపథ్యంలో ఇక్కడ సందడి చేశారు.

మిస్ గుజరాతీగా చెన్నైకి చెందిన ఇషా
ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ జయా మిశ్రా, బిగ్ బాస్ ఫేమ్ డీమ్డ్ గంగూలీ, మిసెస్ ఇండియా ఇంటర్నేషనల్ రిచా శర్మలు పోటీదారులకు గ్రూమింగ్ సెషన్ తర్ఫీదునిచ్చారు. 18 మంది ఫైనలిస్ట్‌లు ఈ గ్రూమింగ్ సెషన్‌లో ట్రెడిషనల్, వెస్ట్రన్ వేర్‌లో సిగ్గులొలికించారు.












Click it and Unblock the Notifications