హైదరాబాద్‌లో మరో 'మెట్రో': భారత్‌లో 17వది

హైదరాబాద్: జర్మనీకి చెందిన ‘మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ' సంస్థ దేశంలోని టోకు వ్యాపారంపై పట్టు మరింతగా బిగిస్తోంది. 2003లో దేశంలో అడుగు పెట్టిన ఈ బహుళ జాతి దిగ్గజం ఇప్పటికే హైదరాబాద్‌, విజయవాడతో సహా దేశంలోని 12 నగరాల్లో 17 స్టోర్లు నిర్వహిస్తోన్న ఈ సంస్ధ కొత్తగా హైదరాబాద్‌లో మరో కేంద్రాన్ని ప్రారంభించింది.

శంషాబాద్‌లోని గగన్ పహాడ్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం గురువారం నుంచి అందుబాటులోకి వస్తుందని కంపెనీ ఇండియా ఎండి రాజివ్‌ భక్షి మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు హారీశ్ రావు, కేకే మహేందర్ రెడ్డి, తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామి గౌడ్, చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో మరో 'మెట్రో'

హైదరాబాద్‌లో మరో 'మెట్రో'

ఈ సందర్భంగా ‘మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ' సంస్థ ఎండీ రాజీవ్ బక్షీ మాట్లాడారు. 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం, భారత్‌లో మెట్రోకు 17వ కేంద్రమని చెప్పారు.

హైదరాబాద్‌లో మరో 'మెట్రో'

హైదరాబాద్‌లో మరో 'మెట్రో'

శంషాబాద్‌ కేంద్రం కోసం మెట్రో దాదాపు రూ.70 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు. కంపెనీ ఇప్పటికే హైదరాబాద్‌లోని మూసాపేట, ఉప్పల్‌లో రెండు టోకు వ్యాపార కేంద్రాలు నిర్వహిస్తోంది.

హైదరాబాద్‌లో మరో 'మెట్రో'

హైదరాబాద్‌లో మరో 'మెట్రో'

తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న మొట్ట మొదటి కేంద్రం ఇదేనని భక్షి చెప్పారు. శంషాబాద్‌లో ఏర్పాటు చేసిన మెట్రో దుకాణం 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని, నేరుగా 150 మందికి, పరోక్షంగా మరో 150 మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు.

హైదరాబాద్‌లో మరో 'మెట్రో'

హైదరాబాద్‌లో మరో 'మెట్రో'

తెలంగాణ నుంచి చికెన్ సేకరించి పంజాబ్‌లో విక్రయిస్తున్నామని, కొత్త విక్రయ కేంద్రం వల్ల స్ధానికంగా రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ మరింతగా పెరుగుతుందని వివరించారు.

హైదరాబాద్‌లో మరో 'మెట్రో'

హైదరాబాద్‌లో మరో 'మెట్రో'

శంషాబాద్‌ సమీపంలోని ఒంటిమామిడిపల్లి సేకరణ కేంద్రం ‘మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ ఇండియా'కి ఉన్న అత్యుత్తమ కేంద్రాల్లో ఒకటిగా పేర్కొన్నారు. ఈ కేంద్రం నుంచి ఆయా సీజన్లలో లభించే పండ్ల తో పాటు వివిధ కూరగాయలు సేకరిస్తున్నామని చెప్పారు.

హైదరాబాద్‌లో మరో 'మెట్రో'

హైదరాబాద్‌లో మరో 'మెట్రో'

శంషాబాద్‌ ప్రాంతంలోని చిన్న, మధ్య తరహా వ్యాపారులు, కేటరర్స్‌, హోటళ్లు, రెస్టారెంట్ల అన్ని కొనుగోళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

హైదరాబాద్‌లో మరో 'మెట్రో'

హైదరాబాద్‌లో మరో 'మెట్రో'

త్వరలో విశాఖపట్నంలో ‘మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ' సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. విశాఖలో స్ధలం కోసం అన్వేషిస్తున్నామని, లభించిన వెంటనే ఏర్పాటు చేస్తామని తెలిపారు.

 హైదరాబాద్‌లో మరో 'మెట్రో'

హైదరాబాద్‌లో మరో 'మెట్రో'

మెట్రో వ్యాపార వ్యూహంలో భారత్‌కు ప్రత్యేక స్థానం ఉందని, మా వ్యాపారానికి సంబంధించి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నాలుగు దేశాల్లో భారత్‌ ఒకటి అని చెప్పారు. మిగతా మూడు దేశాలు రష్యా, చైనా, టర్కీ ఉన్నాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+