హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'కచ్' అదుర్స్ అన్న 'బ్యాక్ బెంచ్' గర్ల్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సరికొత్త సొబగులు.. సంప్రదాయ.. ఆధునిక దుస్తులకు సృజన్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఎగ్జిబిషన్ వేదికగా నిలిచింది. సృజన్ సంస్థ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ప్రముఖ టాలీవుడ్ నటి, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ మీవీ ఫేమ్ తనుషా ప్రారంభించారు.

గుజరాత్‌కు చెందిన కచ్ కమ్యూనిటి సంప్రదాయం ప్రతిబింభించే విధంగా సరికొత్తగా సిటీ ఫ్యాషన్ ప్రియుల కోసం అందుబాటులో తీసుకురావడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆమె అన్నారు. మగువ అందానికి చీరకట్టు సోయగంగా ఉంటుందన్నారు. చీరకట్టుకు తాను ఎంతో ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.

సృజన్ సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ షెల్లీ, దత్త మాట్లాడుతూ... ప్రముఖ డిజైనర్లు ఉత్పత్తులకు డిజైన్ చేశారని చెప్పారు. ఈ నెల 19వ తేది వరకు ప్రదర్శన ఉంటుందన్నారు. పదహారు రకాల ఎంబ్రాయిడరీ డిజైన్స్ కలిగిన చీరలు, స్కర్ట్స్, దుపట్టాస్, టాప్స్, హ్యాండ్ బ్యాగ్స్, హ్యాంగింగ్స్ తదితరాలు వందల రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.

సృజన్ 1

సృజన్ 1

అతి క్లిష్టమైనప్పటికీ అందర్నీ ఆకట్టుకునే రీతిలో గుజరాత్ కచ్ ప్రాంతీయుల చేనేత శైలి ఉంటుంది. ఈ శైలిని నగరవాసులకు పరిచయం చేయడానికి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14లోని వీవ్స్ బోటిక్‌లో ఓ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు.

సృజన్ 2

సృజన్ 2

గుజరాత్ కచ్ ప్రాంతీయుల చేనేత శైలిని నగరవాసులకు పరిచయం చేయడానికి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14లోని వీవ్స్ బోటిక్‌లో ఓ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు.

సృజన్ 3

సృజన్ 3

సృజన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రదర్సన నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో మూడు వేలకు పైగా డిజైన్లను ప్రదర్శిస్తున్నారు.

సృజన్ 4

సృజన్ 4

ఈ నెల 19వ తేది వరకు సృజన్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఎగ్జిబిషన్ ఉంటుంది. సరికొత్త సొబగులు.. సంప్రదాయ.. ఆధునిక దుస్తులకు సృజన్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఎగ్జిబిషన్ వేదికగా నిలుస్తోంది.

సృజన్ 5

సృజన్ 5

సృజన్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఎగ్జిబిషన్‌ను ప్రముఖ నటి, బ్యాక్ బెంచ్ నటి తనూష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కచ్ ప్రాంతంలోని మహిళలకు ఉపాధి కలిగిస్తూ సృజన్ సంస్థ ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తోందన్నారు.

సృజన్ 6

సృజన్ 6

గుజరాత్‌కు చెందిన కచ్ కమ్యూనిటి సంప్రదాయం ప్రతిబింభించే విధంగా సరికొత్తగా సిటీ ఫ్యాషన్ ప్రియుల కోసం అందుబాటులో తీసుకురావడం అభినందనీయమని తనూషా అన్నారు.

సృజన్ 7

సృజన్ 7

నేటి తరం మహిళలనే కాకుండా భవిష్యత్తు తరాలను కూడా ఆకట్టుకునే డిజైన్లు సృజన్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఎగ్జిబిషన్‌లో ఉన్నాయని తనూషా చెప్పారు.

సృజన్ 8

సృజన్ 8

తనూషా.. తాను చేస్తున్న సినిమాల గురించి మాట్లాడుతూ ప్రస్తుతం తాను నందమూరి హీరో బాలకృష్ణతో జయసింహ చిత్రంలో చేస్తున్నట్లు చెప్పారు.

సృజన్ 9

సృజన్ 9

బాలకృష్ణ జయసింహ సినిమాలో తక్కువ సేపు మాత్రమే కనిపించే పాత్ర అయినప్పటికీ ఆయనకు మరదలుగా ఆ చిత్రంలో చేయడం తనకు చాలా ఆనందంగా ఉందని తనూషా అన్నారు.

సృజన్ 10

సృజన్ 10

గతంలో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చిత్రంలో చేసిన తాను తమిళంలో భరత్ సరసన సెకండ్ హీరోయిన్‌గా ఓ చిత్రంలో చేస్తున్నట్లు తనూషా చెప్పారు.

సృజన్ 11

సృజన్ 11

సృజన్ సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ షెల్లీ, దత్త మాట్లాడుతూ... ప్రముఖ డిజైనర్లు ఉత్పత్తులకు డిజైన్ చేశారని చెప్పారు. ఈ నెల 19వ తేది వరకు ప్రదర్శన ఉంటుందన్నారు.

సృజన్ 12

సృజన్ 12

మగువ అందానికి చీరకట్టు సోయగంగా ఉంటుందని, చీరకట్టుకు తాను ఎంతో ప్రాధాన్యత ఇస్తానని నటి తనూషా ఈ సందర్భంగా చెప్పారు.

సృజన్ 13

సృజన్ 13

సృజన్ సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ షెల్లీ, దత్త మాట్లాడుతూ... చీరలు, స్కర్ట్స్, దుప్పట్టలు, స్టోల్స్, మఫ్లర్స్, హ్యాండ్ బ్యాగ్స్, హ్యాంగింగ్స్ .. ఇలా అన్ని రకాల వస్త్రాలతో పాటు హోమ్ ఫర్నిషింగ్ కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచినట్లు చెప్పారు.

English summary
Shrujan, a 44 year old organization working for the uplifment of Kutch hand embroidery techniques are presenting products from Kutch Fashioned with Hand Embroidery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X