రాహుల్ యాత్ర: ఆంధ్రా కాంగ్రెస్‌లో జోష్ (ఫోటోలు)
హైదరాబాద్: అనంతపురంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన తర్వాత ఏపీలోని కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సహాం వచ్చింది. రాహుల్ గాంధీ అనంతపురం టూర్ సక్సెస్ అయిందని రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు ఆనందంలో ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు.
ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం కష్టమేనని భావించారు నేతలంతా. మరికొంత మంది నేతలైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీల కండువాలను కూడా కప్పుకున్నారు. ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు గాను ఏపీసీసీ అనంతలో రాహుల్ పర్యటనను ఏర్పాటు చేశారు. అనంతపురంలో రాహుల్ పర్యటన విజయవంతం అయింది.
అనంతపురం పర్యటనలో రాహుల్ గాంధీ 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో ఆత్మహత్యలు చేసుకున్న 63 మంది రైతుల కుటుంబాలను కలసి.. వారితో మాట్లాడారు. అధైర్యపడొద్దు తామున్నామంటూ భరోసా ఇచ్చారు. రైతులు, ఉపాధి కూలీలు, మహిళా సంఘాలతో పాటు, విద్యార్ధులతో కూడా సమావేశమయ్యారు.

రాష్ట్ర విభజనపై రాహుల్ వివరణ
రాష్ట్ర విభజనపై కోపంగా ఉన్న ఏపీ ప్రజలకు రాహుల్ వివరణ ఇచ్చుకున్నారు. విభజన విషయంలో కాంగ్రెస్ ఎలాంటి తప్పూ చేయలేదన్నారు. తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ రాష్ట్ర విభజన కోరిన తర్వాతే చిట్టచివరిగా విభజన నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారు. తీరా... విభజనపై నిర్ణయం తీసుకున్న తర్వాత కొన్ని పార్టీలు యూటర్న్ తీసుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన పర్యటనలో తల్లి సోనియా పర్యటనను ప్రస్తావించని రాహుల్
నాన్నమ్మ ఇందిరను పదేపదే గుర్తుకు తెచ్చుకున్న రాహుల్... అమ్మ సోనియాగాంధీ మాటెత్తకుండానే అనంతపురం జిల్లాలో తన పర్యటన ముగించారు. నిజానికి... సోనియా గాంధీ ఇదే జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను 2004 ఎన్నికల ముందు సోనియా పరామర్శించారు. వారికి ఆర్థిక సహాయం కూడా అందించారు. 35 సంవత్సరాల క్రితం ఇక్కడ పర్యటించిన ఇందిర గురించి చెప్పారు కానీ... తన తల్లి సోనియా పర్యటన ప్రస్తావన మాత్రం రాహుల్ తీసుకురాలేదు.

దళితుడి ఇంట్లో రాహుల్ భోజనం
రాహుల్‌గాంధీ కొండకమర్ల ఎస్సీ కాలనీలో రవి అనే దళితుడి ఇంట్లో మధ్యాహ్న భోజనం చేశారు. ఆ కుటుంబ సభ్యులు, నాయకులతో కలిసి రాయలసీమ ప్రత్యేక వంటకమైన రాగిసంకటి, వేరుశనగ (పల్లీలు) చెట్నీతో కలిసి తిన్నారు. ఆహార పదార్థాలను తొలుత భద్రతా సిబ్బంది పరీక్షించారు. ఆ తర్వాత రాహుల్ భోజనం చేశారు.

హరినాథరెడ్డి కుటుంబానికి రాహుల్ పరామర్శ
మామిళకుంటుపల్లి గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న హరినాథరెడ్డి కుటుంబాన్ని రాహుల్ పరామర్శించారు. ఆ కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

హరినాథరెడ్డి కుటుంబానికి రాహుల్ పరామర్శ
హరినాథరెడ్డి ఆత్మహత్యకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి రూ. 50వేల ఆర్ధిక సాయాన్ని అందజేశారు. రాహుల్ గాంధీ వెంట కేంద్ర మాజీ మంత్రులు చిరంజీవి, పళ్లంరాజు, ఏపీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి తదితరులు ఉన్నారు.

రూ. 50వేల ఆర్ధిక సాయాన్ని స్వయంగా అందజేసిన రాహుల్
చిన్నవయసులోనే భర్తను కోల్పోయిన పుష్పలతను రాహుల్ గాంధీ ఓదార్చారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 50వేల చొప్పున చెక్‌లను రాహుల్ గాంధీ చేతుల మీదగా అందజేశారు.
కాంగ్రెస్ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇచ్చి నష్టపోయామని ఏపీ నేతలు చెప్పగా అన్ని పార్టీలు కోరితేనే విభజన జరిగిందని, దీనిని ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో మనం విఫలమయ్యామని చెప్పారు.
గతం అంతా మరిచిపోవాలని, భవిష్యత్తు గురించి ఆలోచించాలని ఆయన ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలకు సూచించారు. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు నేను వస్తానని ఆయన చెప్పారు. బలోపేతం కావడం ముఖ్యమని చెప్పారు. ఇందిరమ్మ వారసుడిగా, ఆమె విలువలు తన రక్తంలో ఉన్నాయని అంటూ అటు ప్రతిపక్షం, ఇటు పాలకపక్షాన్ని ఏకేశారు.
అనంత పర్యటనలో రాహుల్ గాంధీ నాన్నమ్మ ఇందిరను పదేపదే గుర్తుకు తెచ్చుకున్నారు. కానీ అమ్మ సోనియాగాంధీ మాటెత్తకుండానే జిల్లాలో తన పర్యటన ముగించారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications