హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంజీవయ్య పార్క్‌లో రోజ్ గార్డెన్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చూడముచ్చటైన రంగురంగుల గులాబీ పూలతో పర్యాటకులను, సందర్శకులను ఆకట్టుకుంటున్న రోజ్ గార్డెన్ నగరవాసులకు అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే తొలిసారిగా హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నగరంలోని సంజీవయ్య పార్కులో గులాబీ వనం, హెర్బన్ గార్డెన్ సందర్శకులకు ఆహ్లాదాన్నిస్తుంది.

ఈ రోజ్ గార్డన్, హెర్బల్ గార్డెన్‌ను డిప్యూటీ సీఎం మహముద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ విశ్వనగరం కానున్న నగరంలో మరిన్ని పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు.

సంజీవయ్య పార్క్‌లో రోజ్ గార్డెన్

సంజీవయ్య పార్క్‌లో రోజ్ గార్డెన్

సీఎం ఆలోచన ప్రకారం ఇంటింటికీ చెట్లు నాటే బృహత్తర పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. కేసీఆర్ పాలనలో నెగిటివ్ థఇంక్ ఉన్నవారూ ప్రస్తుతం పాజిటివ్‌గా స్పందిస్తున్నారన్నారు. షాదీ ముబాకర్ పథకం వివరాలను కాశ్మీర్ సీఎం సైతం అడిగి మరీ తెలుసుకున్నారన్నారు.

 సంజీవయ్య పార్క్‌లో రోజ్ గార్డెన్

సంజీవయ్య పార్క్‌లో రోజ్ గార్డెన్


హుస్సేన్ సాగర్ చుట్టూ ఇప్పటికే అందమైన వాతావరణాన్ని కల్పించామని, త్వరలో ఈ అందాలను హెలికాప్టర్ ద్వారా తిలకించే అవకాశాన్ని ప్రారంభించినున్నట్లు హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు తెలిపారు. సంజీవయ్య పార్క్ వద్ద హెలికాప్టర్ రైడింగ్ కేంద్రాన్ని సీఎం అనుమతితో ఏర్పాటు చేస్తామన్నారు.

 సంజీవయ్య పార్క్‌లో రోజ్ గార్డెన్

సంజీవయ్య పార్క్‌లో రోజ్ గార్డెన్


ఈ 3. కోట్లు ఖర్చుతో ప్రారంభించిన రోజ్ గార్డెన్‌లో ఆహ్లాదకర వాతవరణాన్ని కల్పించేలా ఏర్పాటు చేశామన్నారు. హుస్సేన్ సాగర్‌ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు పాల్గొన్నారు.

 సంజీవయ్య పార్క్‌లో రోజ్ గార్డెన్

సంజీవయ్య పార్క్‌లో రోజ్ గార్డెన్


సంజీవయ్య పార్క్‌లో ఏర్పాటు చేసిన ఈ గులాబీ వనంలో 650 రకాల రోజా మొక్కలను సందర్శకుల దర్శనార్ధం ఉంచారు. భిన్నమైన ఆకృతిలో ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఎనిమిది అడుగులు ఎత్తు పెరిగే స్టాండర్ట్ రకం రోజా మొక్కలను సైతం ఉంచారు. ఈ రోజాలను ఫార్మల్ గార్డెన్, సర్క్యులర్ గార్డెన్, వేవీ గార్డెన్, ఫౌంటెయిన్స్ వద్ద భిన్నాకృతుల్లో రూపుదిద్దుకున్నాయి.

సంజీవయ్య పార్క్‌లో రోజ్ గార్డెన్

సంజీవయ్య పార్క్‌లో రోజ్ గార్డెన్


సంజీవయ్య పార్క్‌లోని గులాబీ వనం సందర్శన ప్రతి రోజు ఉ. 9 నుంచి సా. 6 గంటల వరకు అనుమతిస్తారు. మార్నింగ్ వాకర్స్‌కు రూ. 5 , మంత్లీ పాస్ రూ. 75 , జనరల్ విజిటర్స్‌కు ఎంట్రీ ఫీజు రూ.10 , చిన్నారులకు రూ. 5గా నిర్ణయించారు.

 సంజీవయ్య పార్క్‌లో రోజ్ గార్డెన్

సంజీవయ్య పార్క్‌లో రోజ్ గార్డెన్

ఇక హెర్బల్ గార్డెన్ విషయానికి వస్తే జంట నగరాల పరిధిలో తొలిసారిగా పూర్తిస్థాయి ఔషధ మొక్కల పార్క్. దీనిని సంజీవయ్య పార్క్ ఎదురుగా నిర్మించారు. దాదాపు 25 ఎకరాల స్థలంలో దాదాపు రూ. 1.75 కోట్లతో ఈ ఔషధ మొక్కల పార్కును అధికారులు తీర్చిదిద్దారు. దీంతో పాటు మిరియాలు, లవంగం, శొంఠి, అల్లం, ధనియాలు, దాల్చిన చెక్క తదితర మొక్కలతో స్పైస్ పార్క్ పనులు పూర్తయ్యాయి.

English summary
Rose Garden At Sanjeevaiah Park, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X