గద్దర్ ఆటలో, కెసిఆర్ మాటలో ఆవేదన(పిక్చర్స్)
ఇన్నేళ్లు పోరాడామని, లక్ష్యాన్ని సాధించామని ఇక ఎవరితో కొట్లాటలు వద్దని, పేదరికాన్ని తుదముట్టించేందుకు, సమాజాన్ని ఏకం చేసేందుకు పోట్లాడాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు.
ప్రత్యేక రాష్ట్రం వచ్చింది కనుక. ఇప్పుడు ఐక్యతతో ముందుకు సాగి చిరునవ్వుల తెలంగాణ, అద్భుత తెలంగాణను నిర్మించుకుందామని స్పష్టం చేశారు. తెలంగాణ, హైదరాబాద్ నుంచి పరిశ్రమలు ఎట్టి పరిస్థితుల్లోనూ సీమాంధ్రకు తరలివెళ్లే పరిస్థితి లేదని నొక్కి చెప్పారు.
తెలంగాణ యూనియన్ ఫర్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జర్నలిస్టుల జాతర జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ లోగోను ఆవిష్కరించారు. అనంతరం జర్నలిస్టులను ఉద్దేశించి కెసిఆర్ మాట్లాడారు.

టియుడబ్ల్యూజె
తెలంగాణ యూనియన్ ఫర్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జర్నలిస్టుల జాతర జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ లోగోను ఆవిష్కరించారు. అనంతరం జర్నలిస్టులను ఉద్దేశించి కెసిఆర్ మాట్లాడారు.

కెసిఆర్
భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని, ఇంటర్నెట్లో వెతికితే ఎవరికైనా ఈ విషయం సుస్పష్టంగా తెలుస్తుందని చెప్పా రు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన మేధావి కూడా ఈ విషయాన్ని చెప్పారన్నారు.

సమావేశంలో జానా, కెకె
సీమాంధ్రలో ఏర్పడే ప్రభుత్వంతో మాట్లాడి వీలైతే పోలవరం బాధితులకు ఎక్కువ నష్టం జరగకుండా కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

కళాకారుల ఆటా పాట
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జర్నలిస్టుకూ పక్కా గృహం నిర్మించి ఇస్తాం. మీడియా రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరినీ జర్నలిస్టులుగా గుర్తిస్తామని, వారందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇస్తామని కెసిఆర్ చెప్పారు.

అమరవీరుల స్థూపం
ఇల్లు మేమే కట్టుకుంటామంటే డబ్బులు ఇచ్చేందుకూ సిద్ధమని, వివిధ స్థాయుల్లో పని చేసే పాత్రికేయులకు స్థలాలు/ఇల్లు ఎక్కడ కావాలనే వివరాలివ్వాలని యూనియన్ నేతలకు కెసిఆర్ సూచించారు.

సమావేశంలో
ఉద్యమ ప్రస్థానంలో జర్నలిస్టులపై మోపిన బూటకపు కేసులను ప్రత్యేక రాష్ట్రంలో ఒక్క దెబ్బతో ఎత్తివేస్తామన్నారు. దేశానికే తలమానికంగా ఉండేలా హైదరాబాద్‌లో సకల సదుపాయాలతో టీయూడబ్ల్యూజే భవనాన్ని నిర్మించుకుందామని చెప్పారు.

తెలంగాణ లైవ్ పుస్తకంతో కెసిఆర్
వందేళ్లుగా తెలంగాణ సమాజం బాధను అనుభవిస్తోందని, అనేక విధ్వంసాలకు గురైందని, స్వాతంత్య్రం రాకముందు బానిసత్వంలో, దొరల గడీల్లో ఘోరకలి జరిగిందని, హైదరాబాద్ రాష్ట్రం విలీనం తర్వాత పరిస్థితి మారుతుందని అనుకుంటే సమైక్య రాష్ట్రంలో పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయిందని వివరించారు.

నారాయణతో కెసిఆర్
పరిశ్రమల రాయితీలకు సంబంధించిన ప్రత్యేక కేటగిరీ హోదా రెండు రాష్ట్రాల్లోనూ అమలవుతుందని, ఈ మేరకు బిల్లులో స్పష్టంగా పొందుపర్చారని చెప్పారు.

కోదండ తదితరులతో..
తెలుగుకు నన్నయ ఆదికవి అనడం సరికాదని, ఆయన అనువాద కవి అని, పాల్కురికి సోమనాథుడు మన ఆదికవి అని కెసిఆర్ అన్నారు.

కెకెతో కెసిఆర్
ఎవరి అమ్మ వారికే గొప్ప అని, అస్తిత్వంపై ఆకాంక్ష హృదయాంతరాల్లోంచి వస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పారు.

గద్దర్ ఆట
టియూడబ్ల్యూజే ఏర్పాటు శుభపరిణామమని, ఉద్యమం తరహాలోనే తెలంగాణ నవ నిర్మాణంలోనూ బాధ్యతగా వ్యవహరించాలని జర్నలిస్టులకు మాజీ మంత్రి జానారెడ్డి సూచించారు.

కెసిఆర్ నివాళి
ఏ లక్ష్యాలు, ఏ ఆకాంక్షల కోసం పోరాడామో వాటిని సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

లోగో
"కలిసి పనిచేద్దాం. తెలంగాణ నిర్మించుకుందాం. అన్ని వర్గాలకు అభివృద్ధిలో వాటా కల్పిద్దాం'' అని టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు.

సమావేశం
అమరుల ఆశయాలను సాధించుకునేదిశగా అందరం కలిసి తెలంగాణ నవ నిర్మాణానికి పాటుపడదామని రాజ్యసభ సభ్యులు కె కేశవ రావు అన్నారు.

సమావేశం
ఉద్యమాన్ని ముందుండి నడిపించిన జర్నలిస్టులు ఇప్పుడు పార్టీలను ముందుకు తీసుకెళ్లాలని బిజెపి నేత నాగం జనార్దన్ రెడ్డి కోరారు. జైళ్ల నుంచి వచ్చిన డెకాయిట్లు, దొంగలకు తెలంగాణలో అధికారం ఇవ్వవద్దని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సూచించారు.

ఐక్యతతతో
ఐక్యతకు పునాది కావాలని, అప్పుడే నవ తెలంగాణ నిర్మాణం సాధ్యమని మరో రాజ్యసభ స భ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ అన్నారు.












Click it and Unblock the Notifications