యుఎఇలో భారతీయులదే సంఖ్యాబలం
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆసోసియేషన్స్ సారథ్యంలో సాగిన పరేడ్‌లో వివిధ భారతీయ సంఘాల బృందాలు పాల్గొన్నాయి.. ఈసారి పరేడ్‌కు ముందుభాగన వుండి సారథ్యం వహించనున్నట్టుగా నిర్వాహకులు ప్రకటించిన ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ ఆఖరు నిమిషంలో గైర్హాజరు అయ్యారు. దాంతో మరో సినీ తార మహిమా చౌధరి అసోసియేన్ బృందానికి పరేడ్‌లో నాయకత్వం వహించారు. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ కూడా పరేడ్‌లో పాల్గొన్నారు.
ఈ వేడుకలకు హాజరైన వారిలో మూన్‌మూన్‌సేన్ ఆమె కుమార్తెలు రియా, రైమా, సంగీతదర్శకుడు బప్పీ లహిరి, గాయని ఉషా ఉతప్, క్రికెట్ ఆటగాళ్లు శ్రీకాంత్, వెంకటపతిరాజు, నటి పూజా భట్ వున్నారు. న్యూయార్క్ నగర మేయర్ రుడాల్ఫ్ గులానీ నగర అభివృద్ధికి భారత జాతీయులు చేసిన సేవలను ప్రస్తుతించారు. ఆయనతో పాటు రిపబ్లికన్ పార్టీ నగర ముఖ్యులు పలువురు వేడుకల్లో పాల్గొన్నారు. న్యూయార్క్ రాజకీయాల్లో ఎంతో కొంత రాణిస్తున్న భారతీయులు రెన్‌లోబో, ప్రదీప్ పీటర్ కొఠారీ, కిరణ్ దేశాయి, జైరామ్ తుక్రాల్ తమతమ మద్దతుదారులతో ఈ పరేడ్‌లో అట్టహాసంగా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
