టిడిపిలో హరికృష్ణ మళ్లీ యాక్టివ్

అకస్తాత్తుగా హరికృష్ణ మంగళవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని కలిశారు. ఆయన వెంట కుమారుడు కళ్యాణ్ రామ్ ఉన్నారు. వరద బాధితుల కోసం హరికృష్ణ తన రెండు నెలల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. అంతేకాకుండా 20 లక్షల రూపాయలను తన ఎంపిల్యాడ్స్ నుంచి ప్రకటించారు. ఎన్టీఆర్ ట్రస్టు తరఫున వాటిని వరద బాధితులకు విరాళంగా ప్రకటించారు. దీంతో ఆయన పార్టీలో మరోసారి క్రియాశీలకంగా పాల్గొనేందుకు ముందుకు వచ్చినట్లు భావిస్తున్నారు.పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నప్పటికీ హరికృష్ణను పార్టీ పోలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు.
కాగా, ప్రభుత్వంపై విమర్శలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పదును పెట్టడం ప్రారంభించారు. ముఖ్యమంత్రి కుర్చీ కింద పాము చేరినా గుర్తించలేనంత స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం ఉందని ఆయన అన్నారు. మరో ముఖ్యమంత్రి కూడా పాము కాటుకు బలై వుంటే పరిస్థితేమిటని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications