హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డైలమాలో రోజా, విజయశాంతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijayasanthi
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి మరణంతో ఇద్దరు తారలు డైలమాలో పడ్డారు. కాంగ్రెసులో చేరడానికి సిద్ధపడిన విజయశాంతి, రోజా ప్రస్తుతం పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం అనుబంధ మహిళా సంఘం తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ఉన్న రోజా ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెసులో చేరాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి రాజీనామా చేయకపోయినా కాంగ్రెసులో చేరుతారనే ఊహాగానాలు బలంగా వినిపించాయి. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఆమె వ్యతిరేకిస్తూ వచ్చారు.

కాగా, వైయస్ మరణంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో రోజాతో పాటు విజయశాంతి కూడా పడినట్లు చెబుతున్నారు. తాజా కాంగ్రెసు పరిణామాలు వారికి నిరుత్సాహాన్ని మిగిల్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుత స్థితిలో కాంగ్రెసులో చేరితే భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళనలో వారున్నట్లు చెబుతున్నారు.

తెలుగు మహిళ అధ్యక్ష పదవికి ఒక ఊపునిచ్చిన రోజా వెళ్లిపోవడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏం చేయాలో తెలియని స్థితిలో పడ్డారని అంటున్నారు. ఆ పదవిని చేపట్టడానికి శాసనసభ్యురాలు సీతా దయాకర్ రెడ్డి నిరాకరించారు. పైగా, దేవరకద్ర వ్యవసాయాధికారి ఆత్మహత్య కేసులో ఆమె ఇరుక్కున్నారు. దీంతో రోజాను తిరిగి పార్టీలోకి రప్పించేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

విజయశాంతి విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకత్వం కూడా మెతకబడినట్లు చెబుతున్నారు. తిరిగి పార్టీలోకి వస్తానంటే ఆహ్వానించడానికి తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అందుకే ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాను ఏ పార్టీలో ఉన్నానో కూడా తెలియని అయోమయంలో ఆమె పడ్డారు. ఆ విషయం ప్రజలే చెబుతారని ఆమె ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ తో అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమరణదీక్ష చేస్తే మంచిదేనని కూడా ఆమె వ్యాఖ్యానించారు. బహుశా, ఆమె తిరిగి తెరాసకు దగ్గర కావడానికి సిద్ధంగా ఉన్నట్లే కనిపిస్తున్నారు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X