చిరంజీవిలో మార్పు

ప్రస్తుతం ఆయన తీరు మారింది. బహుశా, రాజకీయాల్లో ఏమి మాట్లాడవచ్చో, ఏమి మాట్లాడకూడదో, ఎలా వ్యవహరించాలో తెలిసి రావడం వల్ల అది జరిగి ఉండవచ్చు. అలాగే, కాంగ్రెసుతో స్నేహం కుదిరిన తర్వాత తనకు సరైన భద్రత చేకూరిందే విశ్వాసం కూడా అందుకు కారణం కావచ్చు. వైయస్ జగన్ కు చెక్ పెట్టి చిరంజీవిని చేరదేసేందుకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని, ఆ విషయం చిరంజీవికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వయంగా చెప్పారని అంటున్నారు. ఈ స్థితిలోనే ఆయన కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను టార్గెట్ చేస్తూ ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలతో ఆయన తీవ్రమైన దుమారమే రేపారు. ఇంతకు ముందైతే చిరంజీవి అలా మాట్లాడడానికి వెనకాడి ఉండేవారు కావచ్చు. కానీ, కాంగ్రెసు అధిష్టానం అండదండలు ఉండడంతో ఆయన అందుకు వెనకాడలేదని అంటున్నారు.
కాగా, ఆయనకు అధికారం కూడా చాలా దగ్గరలోనే కనిపిస్తున్నట్లుంది. వైయస్ జగన్ వెళ్లిపోవడం, చిరంజీవి రావడం కాంగ్రెసులో త్వరలో జరిగే పరిణామమని ఊహిస్తున్నారు. అలా జరిగినప్పుడు చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఈ వాతావరణంలోనే ఆయన కడప జిల్లాలో కూడా పర్యటన పెట్టుకున్నారు. వైయస్ జగన్ సొంత జిల్లా కడపలో ఆయన తన ఆరోపణల ధాటిని తగ్గించలేదు. ఏ మాత్రం తడబాటు లేకుండా, ఫ్రీగా ఆయన మాట్లాడుతున్నారు. వాక్యాలు వాక్యాలు ఆయన నోటి నుండి వెలువడుతున్నాయి. ఇది ప్రజలను ఆకర్షించే అవకాశం ఉంది. రాజకీయాలకు చిరంజీవి పనికి రాడనే వారిని ఆలోచింపజేసే విధంగా ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications