చిరంజీవి పొత్తు రగడ

చిరంజీవి కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన తర్వాత పొత్తు విషయం ప్రధానంగా ముందుకు వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెసుతో పొత్తు ఉంటుందని పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకు వెళ్లడం మొదలు పెట్టారు. కాంగ్రెసుతో పొత్తు ఉంటుందనే నాయకులు, కార్యకర్తలు ఇంత కాలం విశ్వసిస్తూ వచ్చారు. అయితే, ఒక్కసారిగా చిరంజీవి ఆ ప్రకటన చేసే సరికి దిమ్మదిరిగి పోయారు. ఇప్పటికే తాము పొత్తు విషయాన్ని ప్రజల్లోకి తీసికెళ్లామని, ఇప్పుడు మళ్లీ కొత్త మాట చెప్తే అయోమయం ఏర్పడుతుందని పార్టీ నాయకులు కొంత మంది చిరంజీవితో అన్నట్లు సమాచారం.
కాగా, చిరంజీవి ముందే పార్టీ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి, నాయకుడు కోటగిరి విద్యాధర రావు మధ్య మాటల యుద్ధం సాగింది. పార్టీ కాంగ్రెసులో విలీనమవుతుందనే ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని శోభా నాగిరెడ్డి చెప్పారు. ఎవరికీ లేని అనుమానం మీకెందుకు వచ్చిందని కోటగిరి విద్యాధర రావు ఆమెను ప్రశ్నించారు. ఈ సమయంలో ఇరువురి మధ్య వాగ్వివాదం చెలరేగింది. అది చాలా తలనొప్పిగా ఉందని శోభా నాగిరెడ్డి అన్నారు. మొత్తం మీద, చిరంజీవి వ్యవస్థాగత నిర్మాణంలోనే కాకుండా స్పష్టమైన వైఖరి తీసుకోవడంలో కూడా విఫలమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications