వైయస్ షాక్ మృతులకూ చెక్

తూర్పుగోదావరి జిల్లాను ఆ దినపత్రిక ఉదాహరణగా తీసుకుని తేడాను విశ్లేషించింది. ఈ జిల్లాలో ఒక వ్యక్తి ఉరేసుకుని చనిపోయినా ఎఫ్ ఐఆర్ నమోదు కాలేదు. కానీ ఆ జిల్లాలో 74 కుటుంబాలను జగన్ ఓదార్చి, ఆర్థిక సాయం అందజేశారు. దీని ప్రకారం ఏఐసీసీ ఆధ్వర్యంలో పరిహారంఅందుకునే కుటుంబం ఒక్కటి కూడా లేదన్నమాట. జగన్ ఓదార్పు యాత్ర చేపట్టనున్న ప్రకాశం జిల్లాలో వైయస్ మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన వారి సంఖ్య ఆయన లెక్క ప్రకారం 40. కానీ ఆ జిల్లాలో ఎఫ్ ఐఆర్ లు నమోదైనది కేవలం ఏడు మరణాలకే. అంటే పార్టీ మార్గదర్శకాల ప్రకారం ఆర్థిక సహాయం అందేది ఆ ఏడు కుటుంబాల వారికే. అన్ని జిల్లాల్లోనూ ఇదే విధంగా ఉంటుందనేది వార్తాకథనం సారాంశం.
గుంటూరు జిల్లాలో 48 మంది మరణించినట్టు జగన్ వర్గం నిర్ధారించగా, వీటిలో గుండెపోటు వంటి సహజ మరణాలే ఎక్కువగా ఉన్నాయి. పురుగుల మందు తాగి, ఉరివేసుకుని చనిపోయిన వారి సంఖ్య ఏడు. పోలీసు రికార్డుల్లో ఐదు మరణాలే నమోదయ్యాయి. నిజామాబాద్ లో ఒకరు మాత్రమే గుండెపోటుతో మరణించారు. వరంగల్ జిల్లాలో ఒక వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరు జిల్లాలో 29 మంది చనిపోయారని జగన్ వర్గం పేర్కొంటుండగా, ఇద్దరు పురుగుల మందు తాగి మృతిచెందినట్టు కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో ఒక యువకుడు ఉరిపోసుకున్నాడు.పశ్చిమ గోదావరి జిల్లాలో 42 మందిని ఓదార్పు యాత్రలో భాగంగా జగన్ పరామర్శించగా, తొమ్మిది మరణాలు మాత్రమే పోలీసు రికార్డుల్లోకి ఎక్కినట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో 14 మందిని పరామర్శించగా, ఒక్క మృతి కూడా రికార్డుల్లోకి ఎక్కలేదని సమాచారం.
ఆదిలాబాద్ జిల్లాలో 11 మంది మరణించినట్టు చెబుతుండగా, రెండు కేసులలోనే ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడగా, ఒక్క కేసులో మాత్రమే ఎఫ్ ఐఆర్ దాఖలయింది. కడప జిల్లాలో 20 మంది మృతి చెందినట్టు పేర్కొంటుండగా, ఒక యువతి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసు కేసు నమోదయింది. విశాఖపట్నం జిల్లాలో ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు ఎఫ్ ఐఆర్ దాఖలైంది. ఎఐసిసి లెక్కల తీరుపై జగన్ వర్గం ప్రశ్నలు సంధిస్తోంది. టీవీ చూస్తూ గుండె ఆగి మరణించినవారిని పరిగణనలోకి తీసుకోలేదని మాట్లాడుతోంది.












Click it and Unblock the Notifications