సిఎం పదవిపై డిఎస్ కన్ను

Srinivas
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ముఖ్యమంత్రి పదవిపై కన్నేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో ఓడిపోకుండా ఉండి ఉంటే వైయస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం ఆయనే ముఖ్యమంత్రి అయి ఉండేవారనే ప్రచారం మొదటి నుంచీ సాగుతోంది. ఇప్పటికి కూడా మించిపోయిందేమీ లేదని డిఎస్ భావిస్తున్నారట. అందుకే తెలంగాణలోని 12 శాసనసభా స్థానాలకు జరిగే ఉప ఎన్నికలను ఆయన సవాల్ గా స్వీకరించినట్లు భావిస్తున్నారు. నిజామాబాద్ శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆయన గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. నిజామాబాద్ నియోజక వర్గంలో విజయం సాధించడం ద్వారా శాసనసభలో అడుగు పెట్టి మెల్లగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలనేది ఆయన వ్యూహమని అంటున్నారు.

తాను శాసనసభకు రావడానికి వీలుగానే ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ పోటీ చేయాలనే వాదనను ఆయన గట్టిగా బలపరిచినట్లు చెబుతున్నారు. పార్టీ అధిష్టానం కూడా ఆయన వాదనకే ఓటు వేసింది. సీమాంధ్ర నాయకుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనే వాదనతో కూడా పార్టీ అధిష్టానం బలపరిచినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి కొన్ని స్థానాలైనా సాధించాలనే పట్టుదలతో డిఎస్ ఉన్నట్లు చెబుతున్నారు. తద్వారా తన సామర్థ్యాన్ని అధిష్టానం వద్ద నిరూపించుకోవాలని ఆయన చూస్తున్నట్లు సమాచారం. తద్వారా పార్టీలో ప్రథమ శ్రేణి నేతగా ముందుకు రావాలనేది ఆయన ప్రయత్నం. బిసి నేతకు భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం వివాదంలో చిక్కుకోవడం ద్వారా భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అవకాశాలు దెబ్బ తినడం డిఎస్ కు మరింతగా కలిసి వస్తుందని అంటున్నారు. అంతేకాకుండా త్వరలో జరిగే పిసిసి అధ్యక్షుడి నియామకంలో కూడా పొన్నాల అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి.

నిజానికి, గతంలోనే తెలంగాణకు చెందిన ఎస్ జైపాల్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని పార్టీ అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. జైపాల్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా పార్టీలోని అన్ని గ్రూపులను అదుపులో పెట్టాలనేది అధిష్టానం వ్యూహంగా కనిపించింది. అయితే అప్పటి సంక్లిష్ట పరిస్థితిలో జైపాల్ రెడ్డి అందుకు అంగీకరించలేదని అంటారు. దానివల్ల రోశయ్యను ముఖ్యమంత్రి పదవి వరించిందని చెబుతారు. శాసనసభలో ఉండి ఉంటే ఆ అవకాశం డిఎస్ కు వచ్చి ఉండేదని అంటారు. ఏమైనా, ఇంకా అందుకు అవకాశం ఉందనే శ్రీనివాస్ భావిస్తున్నారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+