వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ యాత్ర: చిరుకు హెచ్చరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర వ్యవహారం ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి ఓ హెచ్చరికలాంటిదని భావిస్తున్నారు. నిజానికి, జగన్ ఓదార్పు యాత్రను ఇంత పెద్ద యెత్తున తెలంగాణవాదులు అడ్డుకుంటారని ఎవరూ ఊహించలేదు. జగన్ కున్న ప్రభుత్వ అండదండలు, పోలీసులు బలగాల భద్రత అలా ఊహించకపోవడానికి ప్రధాన కారణం. పైగా, ఇటీవలి కాలంలో తెలంగాణ ఉద్యమ ఉధృతి గణనీయంగా తగ్గిందనే ప్రచారం జరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ ఓదార్పు యాత్ర తెలంగాణలో అక్కడక్కడ నిరసనలను ఎదుర్కోవడం ద్వారా సజావుగానే సాగిపోతుందని భావించారు. వాస్తవానికి, ఇలా అవుతుందని జగన్ గానీ, ఆయన యాత్రకు ఏర్పాట్లు చేసిన కొండా సురేఖ దంపతులు గానీ అనుకుని ఉండరు. తమ అంచనాలు తలకిందులు కావడం వల్లనే కావచ్చు, కొండా సురేఖ తెలంగాణవాదులను దుమ్మెత్తి పోశారు. అయ్యకు, అవ్వకు పుట్టినోళ్లు కాదని శాపనార్థాలు పెట్టారు. సరే, దీన్ని ఉండనిద్దాం.

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తాను తెలంగాణలో పర్యటించి తీరుతానని పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఆయన ప్రకటనలు చేసినప్పుడల్లా ఎలా తిరుగుతారో చూస్తామని తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల జెఎసి, విద్యార్థి సంఘాల జెఎసి హెచ్చరిస్తూనే ఉన్నాయి. చిరంజీవి తెలంగాణ పర్యటనకు రావడం లేదు. వారికి అడ్డుకునే పని లభించడం లేదు. సమైక్యాంధ్ర నినాదాన్ని బలంగా వినిపిస్తున్న చిరంజీవి తెలంగాణలో పర్యటించడానికి పూనుకుంటే ఏమవుతుందో జగన్ యాత్ర ద్వారా తెలిసి వచ్చిందని అంటున్నారు. వైయస్ జగన్ కు తెలంగాణలో బలమైన అనుచరులున్నారు. తెలంగాణవాదులను తమ బలగంతో ఎదుర్కోగల సత్తా ఉన్నవారు. అయినా, జగన్ యాత్ర ముందు పడలేదు. ఇక చిరంజీవి తెలంగాణలో పర్యటించడం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సవాల్ చేసినట్లుగా పర్యనటకు వస్తే మరింత దారుణంగా ఉంటుందనేది జగన్ అనుభవం ద్వారా తెలిసి వచ్చినట్లేనని అంటున్నారు. సమైక్యవాదులు ఎవరు వచ్చినా పరిస్థితి ఇలాగే ఉంటుందనేది తెలంగాణవాదులు చెప్పాల్సిన రీతిలోనే చెప్పారని అంటున్నారు.

కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వస్తే కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ ఉండదు. తెలంగాణ కాంగ్రెసు నాయకులే తెలంగాణ ప్రాంతంలో స్వేచ్ఛగా తిరగలేని వాతావరణం ఉంది. సమైక్యాంధ్ర వాదులు తెలంగాణకు వస్తే సజావుగా సాగిపోతుందనుకుంటే భ్రమనే అనే అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష బలాన్ని గుర్తించకుండా ఇప్పటికీ జగన్ మాత్రమే కాకుండా చిరంజీవి, లగడపాటి రాజగోపాల్ ఇతర సీమాంధ్ర నేతలు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, జెఎసి కన్వీనర్ కోదండారమ్ ను తిట్టిపోసినంత మాత్రాన సరిపోదని గుర్తించాల్సి ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X