జగన్ ఫీవర్ తో ఢిల్లీ చుట్టూ సిఎం చక్కెర్లు

YS Jagan
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 16 రోజుల పాలనలో దాదాపు నాలుగోవంతు రోజులు ఢిల్లీలోనే గడిపారు. కిరణ్ ఇప్పటికి నాలుగుసార్లు ఢిల్లీ వెళ్లారు. మంత్రివర్గ కూర్పు కోసమైతే ఏకంగా దాదాపు మూడురోజులు ఢిల్లీలోనే గడిపారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటినుండే ఆయనకు సమస్యలు స్వాగతం పలికాయి. రాష్ట్రం చాలా సున్నిత సమస్యలలో కూరుకు పోయిన సమయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలు పక్కన పెడితే తెలంగాణ, సమైక్యాంధ్ర ప్రాంతీయ విభేదాలతో పాటు, మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు పెద్ద తలనొప్పిగా తయారయ్యారు.

ఆయన మంత్రివర్గ కూర్పు కోసం ఢిల్లీలోనే మూడు రోజులు తిష్ట వేయటం, సభాపతి, ఉపసభాపతి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, నామినేటెడ్ పదవులు భర్తీ విషయంలో ఆయన జగన్ వైపు చూడటమే కాకుండా, ప్రాంతీయ, సామాజిక విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇన్ని సమస్యల కారణంగా అయన తరుచూ ఢిల్లీ వెళ్లి అధిష్టానం గడ్డం పట్టుకుంటున్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ, జగన్ సమస్యలు తీర్చలేడనే భావనతోనే కిరణ్ ను ముఖ్యమంత్రిగా చేస్తే ఆయన సైతం తన బొప్పిని అధిష్టానం ముందుకు తరుచూ తీసుకు పోతున్నాడు.

బాధ్యతలు స్వీకరించిన పక్షం రోజులలోనే తరుచూ ఢిల్లీ పర్యటనంటున్నారు. శనివారం శాసనసభ సమావేశాల అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్లి ఆదివారం ఉదయం తిరిగి వచ్చారు. ఆయన స్వంతగా రచన చేసిన మంత్రివర్గ విస్తరణ వివాదాలకు దారితీసిన విషయం తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు పరిగణలోకి తీసుకోలేదనే ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ వ్యూహరచన సమావేశం, కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డితో భేటీ అనంతరం ఇవాళ ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు. స్పీకరు, డిప్యూటీ స్పీకరు, పిసిసి పదవుల వ్యూహం కోసమే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+