వైయస్ జగన్ ఒక్కడు కాడు

వైయస్ జగన్ కు వ్యతిరేకంగా రోజుకో రాజకీయం, పూటకో పన్నాగం జరుగుతోందని సాక్షి టీవీ చానెల్ వ్యాఖ్యానించింది. వైయస్ జగన్ కు వ్యతిరేకంగా ప్రత్యర్థుల పాచికలు పారలేదని కూడా అభిప్రాయపడింది. వైయస్ జగన్ కు వ్యతిరేకంగా ఎందుకు, ఎవరు కుట్రలు చేస్తున్నారనే విషయంపై కూడా వ్యాఖ్యానించింది. వైయస్ జగన్ వర్గం కాంగ్రెసులోని సీనియర్ నేతలు, ముఖ్యంగా తెలంగాణ నేతలను టార్గెట్ చేసుకుంది. వి హనుమంతరావు, కె. కేశవరావు, రాయపాటి సాంబశివ రావు వంటి నాయకులపై ధ్వజమెత్తుతోంది. వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యురాలు కొండా సురేఖ, అంబటి రాంబాబు, గోనె ప్రకాశరావు వంటి నాయకులు చేస్తున్న ప్రకటనలు వైయస్ జగన్ తిరుగుబాటు కార్యాచరణను ధ్వనిస్తున్నారు.
వైయస్ జగన్ ను టార్గెట్ చేసుకున్న నేతలు ఇంతకు ముందు ఏ విధమైన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారో, వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రశ్నించడానికి వైయస్ జగన్ వర్గం సిద్ధమైంది. అటువంటి నాయకుల జాబితాను కూడా వైయస్ జగన్ వర్గం తయారు చేసింది. పార్టీ అధిష్టానంపై ఏ విధమైన వ్యాఖ్యలు చేయని వైయస్ జగన్ పై ఏ విధంగా చర్యలు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూర్ లో ఉన్న వైయస్ జగన్ శుక్రవారం హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత అసమ్మతి రాజకీయాలు అసెంబ్లీ వేదికగా ఊపందుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications