సిఎంగా కిరణ్ ఆరునెలలేనా?

Kiran kumar Reddy
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆరు నెలలే ఉంటాడనే వార్తలు గుప్పుమంటున్నాయి. పలు సమస్యల కారణంగా కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిని ఆరునెలలే ఉంచి ఆ తర్వాత తెలంగాణకు చెందిన ఓ వ్యక్తిని ముఖ్యమంత్రిగా పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కిరణ్ ముఖ్యమంత్రిగా ఆరునెలలే ఉంటాడని మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షిలో ముమ్మరంగా వార్తలు వస్తున్నాయి. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఈ డిసెంబర్ 31 తర్వాత కేంద్రానికి సమర్పించిన అనంతరం రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉంటాయని కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రిలు న్యూఢిల్లీలో జరుగుతున్న ప్లీనరీలో వాకబు చేస్తున్నట్టు తెలుస్తోంది.

మాజీ ముఖ్యమంత్రి రోశయ్యను దించి సమర్థవంతమైన ముఖ్యమంత్రిని నియోగించుదామనే ఉద్దేశ్యంతోనే కిరణ్ ను నియమించినప్పటికీ కిరణ్ తమను సంతృప్తి పరిచేలా పాలన సాగించడం లేదనే అభిప్రాయంతో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ, వైఎస్ జగన్ తదితర సమస్యలను కిరణ్ అధిగమిస్తాడని అనుకుంటే ఆయన ఆదిలోనే మంత్రివర్గ విస్తరణలో భంగపడ్డారని అధిష్టానం భావిస్తోంది. మంత్రివర్గ విస్తరణ సమస్యను అధిగమించలేని కిరణ్ ముందున్న అతిపెద్ద సవాళ్లు వైఎస్ జగన్, తెలంగాణను అధిగమించటం కష్టమేనని ఢిల్లీ భావిస్తోంది. ఈ కారణంగానే ముఖ్యమంత్రిని మార్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ సమస్యలతో పాటు కిరణ్ మెడకు మరో సమస్య తగిలింది. న్యూఢిల్లీలో ప్లీనరీ సమావేశాలు జరిగే ప్రాంతంలో భావి ప్రధాని ప్రణబ్ ముఖర్జీ అంటూ పోస్టర్లు అతికించారు. ఆ పోస్టర్లు ముద్రించింది మన రాజధానిలోనే. దీంతో ఈ విషయమై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ ముఖ్యమంత్రి కిరణ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. భావి ప్రధానిగా రాహుల్ గాంధీ అని దేశమంతా అనుకుంటుంటే భావి ప్రధానిగా ప్రణబ్ పేరు బయటకు రావడం ఆమెను తీవ్ర అసంతృప్తికి గురిచేసినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే సోనియా సికింద్రాబాదులో పోస్టర్లు ముద్రితం కావటంతో కిరణ్ కు క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ఈ పోస్టర్లు గతంలో కూడా పార్లమెంటు సమావేశాలకు ముందు పార్లమెంటు పరిసరాల్లో అతికించారు. ఇలా జరగడం ఇధి రెండోసారి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+