• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చిరు తెలంగాణ ఫ్యాన్స్ హుషారు

By Srinivas
|
Chiranjeevi
చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యాన్ని అభిమాన సంఘాలు బలపరుస్తాయా అనేది ఇప్పుడు పలువురు మెదళ్లలో మెదులుతున్న ప్రశ్న. ఎందుకంటే ఇన్నాళ్లు అభిమాన సంఘాలను పార్టీకి అధికారికంగా అనుసంధానం చేయలేదు. కాని ఇప్పుడు పార్టీ స్థాపించి రెండు సంవత్సరాలు దాటిన తర్వాత చిరంజీవి అభిమాన సంఘాలను పార్టీకి అనుసంధానం చేయాలని నిర్ణయం తీసుకోనే ఆలోచనలో ఉంది. చిరంజీవికి వెన్నంటే ఉంటామంటున్న అభిమాన సంఘాలు పార్టీతో అనుసంధానం చేస్తే రాజకీయంగా అండగా ఉంటారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. గత అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో అభిమానసంఘాలను అనుసంధానం చేయక తప్పదనే ఆలోచనకు పార్టీ వచ్చింది.

ఆంధ్రా, రాయలసీమల్లో పరిస్థితిని పక్కన పెడితే 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలోని అభిమాన సంఘాలు ఎలా ఉంటాయన్నదే అసలు ప్రశ్న. ఆంధ్రా, రాయలసీమల్లో చిరంజీవితో పాటు బాలకృష్ణ వంటి హీరోలకూ ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. కానీ తెలంగాణలో చిరంజీవికున్న ఫాలోయింగ్ మరే హీరోకూ లేదనేది ఎవరూ కాదనలేని విషయం. తెలంగాణలోని 10 జిల్లాల్లో చిరంజీవికి చాలా అభిమాన సంఘాలున్నాయి. చిరు రాజకీయాల్లోకి వచ్చిన తరువాత అయినా, రాకముందు ఆయినా ఇక్కడ చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామచరణ్ తేజ చిత్రం విడుదల అయితే థియేటర్ల వద్ద అభిమానుల సందడే సందడి. ఒక్కో టిక్కెట్టుకు వేల రూపాయలు పెట్టి కొంటారు. చిరంజీవి అండ్ ఫ్యామిలి చిత్రం మొదటి ఆట చూడలేక పోతే నిరాశ పడుతారు. తెలంగాణలోని చిరంజీవి అభిమానులు తమ ప్రాంతంలోకి చిరును ప్రవేశపెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన చేత తెలంగాణ పర్యటన చేయించాలని అశపడుతున్నారు. అది సాధ్యమవుతుందా అనేది ప్రస్తుతం చెప్పలేని స్థితి ఉంది.

అలాంటి అభిమానులున్న చిరంజీవికి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మొత్తంల కలిపి కేవలం రెండే సీట్లు వచ్చాయి. కారణం తెలంగాణ ఉద్యమం మంచి ఊపులో ఉండటమే కారణం. ఇక్కడి ప్రజలతో పాటు చిరు అభిమానులు కూడా చిరంజీవి ఇప్పటీకీ మా ఆభిమానే, చిరంజీవికి ఎదురు లేదు అంటారు. కానీ రాజకీయంగా చిరంజీకి మాత్రమ మద్దతునిచ్చేది లేదంటారు. చిరు తెలంగాణకు మద్దతు పలికితేనే ఆయనకు ఓట్లు వేయడానికి సిద్ధమని వారంటారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని వారు ఖచ్చితంగా చెబుతున్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించక పోవటం వల్లనే గత ఎన్నికల్లో చిరుకు అభిమానుల ఓట్లు అనుకున్న స్థాయిలో పడలేదు.

చిరంజీవి తెలంగాణలో పర్యటిస్తే అడ్డుకుంటామన్న ప్రజలకు చిరు అభిమానులు కూడా మద్దతు పలుకుతున్నారు. కొందరు అభిమానులు చిరు ఫోర్స్ తో ఏర్పడి తెలంగాణలో చిరు పర్యటనను అడ్డుకునే వారికి బుద్ధి చెబుతామని చెప్పినప్పటికీ అలాంటి వారు ఉన్నది చాలా తక్కునే. అయినా ప్రకటన చేసి నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు మళ్లీ వారి అడ్రస్ లేదు.

తాజాగా తెలంగాణ ఫ్రంట్ స్థాపించిన గద్దర్ తో కూడా చిరు అభిమానులు మాట్లాడటానికి ప్రయత్నించారు. అయితే ఆయన మాత్రం చిరుతో తెలంగాణకు ఒప్పిస్తేనే అభిమానులతో మాట్లాడుతానని కరాకండిగా చెప్పాడు. అంతేకాకుండా చిరుకు కేవలం అభిమానుల మద్దతు మాత్రమే కాకుండా ప్రజల మద్దతు కూడా కావాలనే విషయాన్ని తెలుసుకోవాలి. కాగా, తెలంగాణపై చిరంజీవి వైఖరి తెలంగాణ అభిమాన సంఘాలను తీవ్ర ఇరకాటంలో పడేస్తున్నాయి. తెలంగాణ అనుకూల శక్తులను ఎదుర్కోవడానికి అభిమానులు సిద్ధపడుతున్నా అందుకు తగిన వాతావరణం ఏర్పడడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X